సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో కొందరు చేస్తున్న ప్రమాదకరమైన స్టంట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. బైక్‌పై అతివేగంగా విన్యాసాలు చేస్తూ, వెనుక కూర్చున్న మహిళ ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేసిన ఓ వ్యక్తి వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
@Vibhasumahi అనే ఎక్స్ (ట్విటర్) ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో ఓ వ్యక్తి బైక్‌ను అత్యంత వేగంగా జిగ్‌జాగ్ పద్ధతిలో నడుపుతూ కనిపిస్తున్నాడు. అతడి వెనుక కూర్చున్న మహిళ పదేపదే బ్యాలెన్స్ కోల్పోతూ బైక్‌పై నుంచి పడిపోవడానికి దగ్గరగా వెళ్లడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బైక్ ఒక్కసారిగా ఎడమ, కుడి వైపులకు మలుపులు తిరుగుతుండటంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైనట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ బైక్ నడుపుతున్న వ్యక్తి మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్టంట్ కొనసాగించడం వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొద్ది గంటల్లోనే వేలాది మంది వీడియోను వీక్షించగా, నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. “ఆత్మవిశ్వాసం బాగుంది… కానీ బాధ్యత ఎక్కడ?”, “ఒక్క క్షణం అదుపు తప్పినా ఇద్దరి ప్రాణాలు పోయేవి”, “వైరల్ కోసం ప్రాణాలతో చెలగాటమా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. వినోదం పేరుతో ప్రాణాలను పణంగా పెట్టడం ఏమాత్రం సమర్థనీయం కాదని, ఇటువంటి వీడియోలు యువతకు తప్పుదారి పట్టించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో ఏ ప్రాంతంలో చిత్రీకరించారన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దీంతో రోడ్డు భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. నిపుణులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, స్టంట్లకు బదులుగా బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
जब बाइक से ज्यादा कॉन्फिडेंस तेज हो ।
भाभी जी बोलती है के धीरे चलाओ
भाई बोलते है अरे हम पर ट्रस्ट रखो
फिर 5 सेकेंड बाद
इतनी भी क्या जल्दी थी के
भाभी को बीच रास्ते में ही उतार दिया 🤣 pic.twitter.com/Ak3NsNr72U— Mahi Singh (@Vibhasumahi) July 25, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి..