Headlines

ఫ్రెషర్స్‌కు Infosys భారీ గుడ్‌న్యూస్‌.. ఒకేసారి డబుల్ ధమాకా! | Infosys Announces Salary Hikes for Employees from October in Three Phases, Plans to Hire 20,000 Freshers This Year

ఫ్రెషర్స్‌కు Infosys భారీ గుడ్‌న్యూస్‌.. ఒకేసారి డబుల్ ధమాకా! | Infosys Announces Salary Hikes for Employees from October in Three Phases, Plans to Hire 20,000 Freshers This Year


హైదరాబాద్‌, జులై 26: ఈ ఏడాది ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఎక్కువ మంది ఉద్యోగులకు అక్టోబర్ నెలలోనే జీతాల పెంపు అమల్లోకి రానుంది. సీనియర్ స్థాయి ఉద్యోగులకు మాత్రం జనవరిలో వేతన సవరణలు వర్తిస్తాయని సలిల్ పరేఖ్ తెలిపారు. మొత్తం ప్రక్రియను మూడు దశల్లో పూర్తి చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే వేతనాల పెంపు శాతం ఎంత అనే విషయాన్ని సంస్థ ఇంకా వెల్లడించలేదు. మరోవైపు ఇన్ఫోసిస్ క్యాంపస్ నియామకాలపై తన నిబద్ధతను కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 4,000 మందికిపైగా కొత్త ఉద్యోగులను సంస్థలో చేర్చుకున్నట్లు తెలిపింది.

గత 12 నెలల కాలానికి సంబంధించిన ఐటీ సేవల ఉద్యోగుల అట్రిషన్ (Attrition) రేటు 13 శాతంగా నమోదైంది. గత త్రైమాసికంలో ఇది 12.6 శాతంగా ఉండగా, ప్రస్తుతం స్వల్పంగా పెరిగింది. అలాగే, జూన్ 30 నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,28,062గా ఉంది. మార్చి చివరి నాటికి ఈ సంఖ్య 3,28,594కి పెరిగింది. ఉద్యోగుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైంది. కంపెనీ వ్యాపారంలో కృత్రిమ మేధస్సు (AI) సేవల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయంలో AI సేవల వాటా 8.2 శాతానికి చేరుకుంది. గత డిసెంబర్ త్రైమాసికంలో ఇది 5.5 శాతంగా ఉండటం గమనార్హం. 30 మిలియన్ డాలర్లకు పైబడిన భారీ ఒప్పందాల విలువ 3.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత త్రైమాసికంలో ఇది 3.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

ఇన్ఫోసిస్ బోర్డు సంస్థలో కీలక నాయకత్వ మార్పును కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సలిల్ పరేఖ్ పదవీకాలం ఏప్రిల్ 2027తో ముగియనుంది. అనంతరం అశీష్ కుమార్ దాస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు ఆయనను ఇప్పటికే సీఈఓ-డిజిగ్నేట్‌గా బోర్డు నియమించింది. ఇన్ఫోసిస్ తాజా నిర్ణయాలతో ఉద్యోగులకు జీతాల పెంపు, భారీ స్థాయిలో ఫ్రెషర్ల నియామకాలు, AI ఆధారిత వ్యాపార విస్తరణ వంటి అంశాలు సంస్థ భవిష్యత్ వృద్ధి వ్యూహాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *