Headlines

Viral Video: రూ.4వేల కోట్లతో నిర్మాణం.. కట్‌చేస్తే.. ప్రారంభించిన 13 రోజులకే ఇది పరిస్థితి! | Rs 4,700 Cr Kanpur Lucknow Expressway Caves In 13 Days After Inauguration in Unnao video goes viral

Viral Video: రూ.4వేల కోట్లతో నిర్మాణం.. కట్‌చేస్తే.. ప్రారంభించిన 13 రోజులకే ఇది పరిస్థితి! | Rs 4,700 Cr Kanpur Lucknow Expressway Caves In 13 Days After Inauguration in Unnao video goes viral


రూ.4,700 కోట్లతో నిర్మించిన ఓ భారీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రారంభించిన 13 రోజులకే పగుళ్లు కనిపించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రంలోని రవాణా వ్యవస్థలను మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే రూ.4700 కోట్లతో లక్నో-కాన్పూర్ మధ్య 6లైన్‌ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే కారిడార్‌ను నిర్మించారు. ఇటీవలనే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ కారిడార్‌ను జూలై 13న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి ఘనంగా ప్రారంభించారు.

అయితే ఈ కారిడార్ ప్రారంభం అయిన 13 రోజులకే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల కరిసిన భారీ వర్షాలకు కాన్పూర్ నుండి లక్నో వైపు వెళ్లే మార్గంలో ఉన్నావ్ సమీపంలోని కొరారీ ప్రాంతంలో రోడ్డు కుంగిపోయింది. కొద్దిదూరం రోడ్డు పగుళ్లు వచ్చినట్టు కనిపించింది. అది గమనించిన వాహనదారులకు ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది చూసిన కాంట్రాక్టర్లు వెంటనే అక్కడ మరమ్మత్తు పనులు చేపట్టారు.

అయితే రోడ్డు కుంగిపోయిన వీడియోను వైరల్ కావడంతో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై మండిపడ్డారు. వేల కోట్ల ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ కారిడార్ ఇలా ప్రారంభమైన 12 రోజులకే కుంగిపోవడం ఏంటని ప్రశ్నించారు. అయితే ఈ ఘటనపై అటు బీజేపీ ఎమ్మెల్యే స్పందిస్తూ.. ప్రతిపక్షాల ఆరోపణలపై మండిపడ్డారు. వర్షాల సమయంలో ఇలాంటి చిన్నపాటి సమస్యలు రావడం సహజమని, సమస్య ఉన్న చోట వెంటనే మరమ్మతులు చేస్తారని తెలిపారు. విపక్షాలు చిన్న చిన్న విషయాలను పట్టుకుని మొత్తం వ్యవస్థపైనే ప్రశ్నలు లేవనెత్తడం సరికాదన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *