Headlines

Actress Poorna: ఇప్పుడు నా బిడ్డ కళ్లల్లో ఆయనను చూసుకుంటున్నా.. నటి పూర్ణ ఎమోషనల్ పోస్ట్ | Tollywood Actress Poorna Shares Emotional Post About Her Father

Actress Poorna: ఇప్పుడు నా బిడ్డ కళ్లల్లో ఆయనను చూసుకుంటున్నా.. నటి పూర్ణ ఎమోషనల్ పోస్ట్ | Tollywood Actress Poorna Shares Emotional Post About Her Father


టాలీవుడ్ నటి పూర్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. అలాగే లెజెండ్ వంటి సినిమాల్లో సహాయక నటిగానూ మెప్పించింది. ఇక బుల్లితెరపై ఢీ వంటి డ్యాన్స్ రియాలిటీ షోల్లో జడ్జీగా కూడా చేసింది. అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోందీ అందాల తార. తన ఇద్దరు పిల్లల పెంపకంతో బిజీగా ఉంటోంది. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది పూర్ణ. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ నకు సంబంధించిన విషయాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. అలాగే తన ఫ్యామిలీ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది పూర్ణ. ‘ప్రియమైన ఉప్పా(నాన్న) ఈ లోకాన్ని విడిచి అల్లా సన్నిధికి చేరి తొమ్మిదేళ్లు గడిచాయి. కానీ ఆయన జ్ఞాపకాలు మా హృదయాల్లో ఇప్పటికీ సజీవంగా నిలిచి ఉన్నాయి. ఆయనని ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు లభించకపోయినా, ఆయన ప్రేమ, దయ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా చూసుకునే స్వభావం గురించి ఎన్నో కథలు విన్నాను. అవి విన్న ప్రతిసారీ ఆయనని ఒకసారి అయినా కలిసుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది’

ఇవి కూడా చదవండి



‘ఇప్పుడు నా రెండో బిడ్డ కళ్లలో మా నాన్న ప్రతిబింబాన్ని చూస్తున్నా. అల్లా మా కుటుంబానికి ఆయన జ్ఞాపకాన్ని గుర్తుచేసే అందమైన వరంగా ఈ బిడ్డని ప్రసాదించాడనిపిస్తోంది. ఉప్పా ప్రేమ, ఆశీర్వాదం ఇప్పటికీ మా కుటుంబంతోనే ఉన్నట్లుగా అనిపిస్తోంది. నాన్న అల్లా దగ్గరకు చేరి తొమ్మిదేళ్లు అయినప్పటికీ, ఉమ్మాకు(‍అమ్మ) మాత్రం అది నిన్ననే జరిగినట్లే అనిపిస్తోంది. కాలం గడిచినా ఆయన లేని లోటు, ఆయనపై ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజూ ఆయనని తలుచుకుంటూనే ఉన్నాం. ఆయన మా హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎప్పటికీ మరచిపోలేము’ అని పూర్ణ ఎమోషనల్ అయింది. తండ్రిని గుర్తు చేసుకుంటూ పూర్ణ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

పూర్ణ ఎమోషనల్ పోస్ట్..

కాగా 2022లో దుబాయికి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్‌ని పెళ్లి చేసుకుంది పూర్ణ. 2023లో ఈ దంపతులకు బాబు పుట్టాడు. ఇక ఈ ఏడాది మార్చి 14న ఓ పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చింది పూర్ణ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *