
తెలంగాణలోని ప్రజలకు గుడ్ న్యూస్. రేవంత్ సర్కార్ ఆగస్ట్ 15న ట్రిపుల్ బొనాంజా అందించనుంది. ఒకేసారి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే మూడు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల పంపిణీతో పాటు గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ మూడు కీలక కార్యక్రమాలను ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించనుంది. వీటి వల్ల రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు లబ్ది పొందనున్నారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. వీటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
క్యూఆర్ కోడ్‌తో కొత్త స్మార్ట్ కార్డులు
తెలంగాణలోని రేషన్‌కార్డుదారులందరికీ కొత్త స్మార్ట్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనుడండగా.. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పంపిణీ చేయనున్నారు. ఈ స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్‌తో పాటు లబ్దిదారుల అడ్రస్, పేర్లు ఉంటాయి. ఇక సీఎం రేవంత్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉంటాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా లబ్దిదారుల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కొత్త పించన్లను ఇప్పటివరకు మంజూరు చేయలేదు. అయితే ఆగస్ట్ 15వ తేదీ నుంచి అర్హులైనవారికి కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నారు. ఇప్పటికే అర్హులైనవారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వారిలో అర్హులను గుర్తించి లబ్దిదారుల జాబితాలో చేర్చింది. పించన్ సొమ్మును నేరుగా లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాలో వేయనున్నారు. గతంలో పోస్టాఫీస్ ద్వారా అందించేవారు. అయితే ఇప్పుడు నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నారు.
కొత్త పింఛన్ల పంపిణీ
దాదాపు 2.50 లక్షల మందికి ఆగస్ట్ 15న పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు చేనేత, గీత కార్మికులు ఇందులో ఉన్నారు. ఇక ఇదే రోజు గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం అమల్లోకి తీసుకురానున్నారు. ఆన్ లైన్ ఫుడ్, క్యాబ్, గ్రోసరీ డెలివరీ కార్మికులకు అండగా ఈ చట్టం తీసుకోస్తున్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు అమలు చేయనున్నారు. వారికి వేతన కొత, అన్యాయ అంక్షల నుంచి రక్షణ కల్పించనున్నారు. ఈ మేరకు గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనున్నారు.