Headlines

గుడ్‌న్యూస్.. ఇక బుక్ చేసిన 3 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్! ఇలా బుక్ చేయసుకోండి.. | Indane ExtraLight Now: Get 10 Kg Composite LPG Cylinder Delivered Within 3 Hours

గుడ్‌న్యూస్.. ఇక బుక్ చేసిన 3 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్! ఇలా బుక్ చేయసుకోండి.. | Indane ExtraLight Now: Get 10 Kg Composite LPG Cylinder Delivered Within 3 Hours


ఎల్‌పీజీ వినియోగదారులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు ఇండియన్ ఆయిల్ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ పేరుతో ప్రారంభించిన ఈ సేవ ద్వారా బుకింగ్ చేసిన కేవలం మూడు గంటల్లోనే 10 కేజీల కాంపోజిట్ ఎల్‌పీజీ సిలిండర్‌ను ఇంటికే డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ అనేది ఆధునిక గృహ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన 10 కేజీల కాంపోజిట్ ఎల్‌పీజీ సిలిండర్. సాధారణ స్టీల్ సిలిండర్లతో పోలిస్తే ఇది తేలికగా ఉండటంతో పాటు తుప్పు పట్టదు. దీంతో మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, చిన్న కుటుంబాలు సిలిండర్‌ను సులభంగా ఎత్తి తరలించవచ్చు.

ఈ సిలిండర్‌కు ఉన్న మరో ప్రత్యేకత పారదర్శకమైన బాడీ. దీని ద్వారా సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో బయట నుంచే చూసి తెలుసుకోవచ్చు. దీంతో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో ముందుగానే అంచనా వేసుకుని రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సేవలో ప్రధాన ఆకర్షణ వేగవంతమైన డెలివరీ. వినియోగదారు సిలిండర్‌ను బుక్ చేసుకున్న తర్వాత మూడు గంటల్లోపే ఇంటికి డెలివరీ చేసే విధంగా సేవను రూపొందించారు. దీంతో అత్యవసర సమయంలో గ్యాస్ కోసం ఎక్కువసేపు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా వినియోగదారులు తమకు అనుకూలమైన సమయంలో డెలివరీని షెడ్యూల్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. కొత్త కనెక్షన్ పొందే సమయంలో తక్కువ డాక్యుమెంటేషన్ అవసరమయ్యేలా ప్రక్రియను సులభతరం చేసినట్లు ఇండియన్ ఆయిల్ తెలిపింది.

ఎలా బుక్ చేసుకోవాలి?

ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ సిలిండర్‌ను IndianOil ONE యాప్, ఇండియన్‌ఆయిల్ కస్టమర్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అలాగే 7588888824 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా కొత్త కనెక్షన్, రీఫిల్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. డిజిటల్ ఆధారిత సేవా వ్యవస్థ కారణంగా బుకింగ్, డెలివరీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రకారం.. ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ సేవ ఇండియన్ ఆయిల్ విస్తృతమైన ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌తో పాటు ఎంపిక చేసిన ఇండియన్ ఆయిల్ రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని గృహాలు, ఉద్యోగ నిపుణులు, చిన్న కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సేవను రూపొందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *