Headlines

ఇది కదా సినిమా అంటే..! ఒక్క ఫైట్ లేదు.. స్పెషల్ సాంగ్స్ లేవు..!! ఏడాదిన్నరగా ఓటీటీని శాసిస్తున్న సినిమా | Do you know which family entertainer is currently trending on OTT, It is Satyam Sundaram

ఇది కదా సినిమా అంటే..! ఒక్క ఫైట్ లేదు.. స్పెషల్ సాంగ్స్ లేవు..!! ఏడాదిన్నరగా ఓటీటీని శాసిస్తున్న సినిమా | Do you know which family entertainer is currently trending on OTT, It is Satyam Sundaram


థియేటర్స్‌లో ప్రస్తుతం కొరియన్ కనకరాజు సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే మరికొన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్స్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఓటీటీల్లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.. ఏళ్లు గడుతున్నా కొన్ని సినిమాలు టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా చాలా స్పెషల్.. ప్రస్తుతం చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. కథలో బలం ఉంటే పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టొచ్చని చాలా సినిమాలు నిరూపించాయి. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా కలెక్షన్స్ లో కుమ్మేస్తున్నాయి. అయితే మాములుగా సినిమా అంటే ఆరు ఫైట్స్, నాలుగు అదిరిపోయే సాంగ్స్, ముఖ్యంగా స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే..

కానీ అలాంటివి ఏమీ లేకుండా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. అంతే కాదు భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా మరేదో కాదు.. అదే మెయియజగన్. ఈ సినిమాను తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ చేశారు. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీ, అరవింద సామి కీలకపాత్రలు పోషించారు. సైలెంట్‌గా వచ్చి, ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న ఒక ఎమోషనల్ డ్రామా.. ఏకంగా 8.4 IMDb రేటింగ్‌తో సూపర్  హిట్ గా నిలిచింది ఈ సినిమా.

ఈ సినిమాలో ఇందులో కార్తీ, అరవింద సామి యాక్టింగ్ జనాలను కట్టిపడేసింది.  సింపుల్ కథ.. ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ అందరిని ఏడిపించింది. 2024లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమాకు ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అటు బాక్సాఫీస్, ఇటు ఓటీటీలో ఈ సినిమా ట్రెండింగ్ అయ్యింది. ఈ సినిమాకు ‘96’ లాంటి ఎమోషనల్ హిట్‌ను అందించిన సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా చూడకపోతే అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *