Headlines

EPFO: ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకుంటున్నారా..? మీకే నష్టం.. ఈ ప్రయోజనాలు కోల్పోయే ఛాన్స్.. | EPF Withdrawal After Leaving Job: Why You Shouldn’t Rush to Withdraw Your PF Balance

EPFO: ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకుంటున్నారా..? మీకే నష్టం.. ఈ ప్రయోజనాలు కోల్పోయే ఛాన్స్.. | EPF Withdrawal After Leaving Job: Why You Shouldn’t Rush to Withdraw Your PF Balance


ఉద్యోగం మానేసిన వెంటనే చాలామంది తమ పీఎఫ్ అకౌంట్లోని నగదును విత్ డ్రా చేసుకుంటారు. ఆర్ధిక అవసరాల రీత్యా వెంటనే ఉపసంహరించుకుంటారు. మూడేళ్ల పాటు పీఎఫ్ అకౌంట్లో ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోతే అకౌంట్ ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అవుతుంది. అకౌంట్ ఇనాక్టివ్‌గా మారితే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవడంలో అడ్డంకులు ఎదురవుతాయి. ఈ భయంతో ఉద్యోగం మానేశాక పీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలను కోల్పోయే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. నగదు అలాగే ఉంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు.

మూడేళ్ల పాటు వడ్డీ

అకౌంట్ ఇనాక్టివ్ అయిన తర్వాత కూడా మూడేళ్ల పాటు వడ్డీ జమ అవుతుంది. రిటైర్మెంట్ అయ్యాక లేదా ఉద్యోగం మానేశాక మూడేళ్ల వరకు వడ్డీ అందుతుంది. దీంతో మీరు వెంటనే విత్ డ్రా చేసుకుంటే ఈ వడ్డీని కోల్పోయే అవకాశముంటుంది. ప్రస్తుతం పీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే ఇందులో వచ్చే వడ్డీ ఎక్కువ. దీంతో పీఎఫ్ అకౌంట్లోనే డబ్బులు ఉంచుకోవడం వల్ల అధిక వడ్డీ అందుతుంది. చక్రవడ్డీ కూడా పొందవచ్చు. ఈ కారణంతో మీకు డబ్బులు వెంటనే అవసరం లేకపోతే పీఎఫ్ అకౌంట్లోనే ఉంచుకోవడం వల్ల లాభం జరుగుతుంది. మీ డబ్బులు సురక్షితంగా ఉండటంతో పాటు వడ్డీని సంపాదిస్తూ ఉంటుంది.

మూడేళ్ల తర్వాత ఏమవుతుందంటే..?

రిటైర్మెంట్ తర్వాత లేదా ఉద్యోగం మానేశాక మూడేళ్ల పాటు అకౌంట్లోని డబ్బులు విత్ డ్రా చేసుకోకపోతే అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. ఒకేసారి అకౌంట్ ఇనాక్టివ్‌గా మారితే వడ్డీ ఆగిపోతుంది. దీంతో మీరు తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మూడేళ్ల వరకు బ్యాలెన్స్‌ను అలాగే ఉంచుకోవచ్చు. ఈ మూడేళ్ల కాలంలో మీ భవిష్యత్ ఖర్చుల కోసం ప్రణాళికలు వేసుకోండి. చాలామంది పీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకుని సేవింగ్స్ అకౌంట్లో దాచుకుంటారు. సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ 3 నుంచి 4 శాతం మాత్రమే లభిస్తుంది. అదే పీఎఫ్ అకౌంట్లోనే ఉంచుకుంటే 8 శాతం వడ్డీ ప్రతీ ఏడాది లభిస్తుంది. ఉద్యోగం మానేశాక వెంటనే విత్ డ్రా చేసుకోవడం, సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకోవడం వల్ల నష్టం తప్ప లాభం జరగదు. చాలామందికి ఈ విషయం తెలియక తక్షణమే విత్ డ్రా పెట్టుకుంటారు. అకౌంట్ ఇనాక్టివ్ అయితే మళ్లీ సులువుగా యాక్టివ్ చేసుకోవచ్చు. దీంతో వెంటనే విత్ డ్రా చేసుకోవడం అనేది మంచి పని కాదని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *