Headlines

Shubman Gill: శుభమన్ గిల్ సోదరిని చూశారా.. ? బాలీవుడ్ హీరోయిన్లకు ధీటుగా ఉందండోయ్.. టీవీల్లో ఆమె చాలా ఫేమస్.. | Meet Cricketer Shubman Gill Sister Shahleen Gill, Now She Enter Traitor 2 Show, Her Photos Goes Viral

Shubman Gill: శుభమన్ గిల్ సోదరిని చూశారా.. ? బాలీవుడ్ హీరోయిన్లకు ధీటుగా ఉందండోయ్.. టీవీల్లో ఆమె చాలా ఫేమస్.. | Meet Cricketer Shubman Gill Sister Shahleen Gill, Now She Enter Traitor 2 Show, Her Photos Goes Viral


టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆయన సోదరి గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తుంది. ఆమె పేరు షహనీల్ గిల్. ఆమె శుభ్ మన్ స్వయనా అక్క. ప్రస్తుతం బుల్లితెరపై చాలా ఫేమస్. టీవీల్లో పాపులర్ అయిన కరణ్ జోహార్ షో ‘ది ట్రేటర్స్’ రెండవ సీజన్ ఆగష్టు 13న ప్రారంభం కాబోతుంది. . మొదటి సీజన్ లాగే, ఈసారి కూడా కరణ్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఇందులో శుభ్‌మన్ గిల్ సోదరి షహనీల్ గిల్‌తో సహా 21 మంది కంటెస్టెంట్లు పాల్గొననున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరలవుతుంది. షో ప్రారంభం కాకముందే, శుభ్‌మన్ గిల్ సోదరి షహనీల్ గిల్‌తో సహా పలువురు కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. అందం, ఆకర్షణ విషయంలో షహనీల్ గిల్ అత్యంత ప్రముఖ నటీమణులకు సైతం పోటీ ఇస్తుంది. ఆ క్రికెటర్ సోదరి ఏం చేస్తుంది, ఆమె ఈ షోలో ఎలా భాగమైంది అని అందరూ తెగ సెర్చ్ చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

క్రికెటర్ శుభ్‌మన్ గిల్ సోదరి షహనీల్ గిల్ తొలిసారిగా ఒక రియాలిటీ షోలో కనిపించబోతున్నారు. ‘ది ట్రేటర్స్ 2’ షోతో షహనీల్ ప్రధాన పాత్రలో అడుగుపెట్టనున్నారు. ఆమె గతంలోనే సోషల్ మీడియా పాపరాజీల దృష్టిని ఆకర్షించారు. క్రికెట్ స్టేడియాలలో తన సోదరుడిని ప్రోత్సహిస్తూ షహనీల్ తరచుగా కనిపించినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవడం ఇదే మొదటిసారి. షహనీల్ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4,56,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో ఉన్న స్నేహం కారణంగా కూడా షహనీల్ వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ జనవరి 2024లో ముంబైలో కలిసి కనిపించారు. వారి స్నేహానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వెలుగులోకి వచ్చాయి.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

శుభ్‌మన్, సారా డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్న సమయంలో కూడా షహనీల్, సారా టెండూల్కర్‌ల స్నేహం అందరి దృష్టిని ఆకర్షించింది. మొహాలీ , చండీగఢ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన షహనీల్ గిల్, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. ఆమె తన తదుపరి చదువుల కోసం కెనడాలో చాలా సంవత్సరాలు గడిపి, ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు, ఒక రియాలిటీ షో ద్వారా అభిమానులకు ఆమెను దగ్గరగా తెలుసుకునే అవకాశం మొదటిసారిగా లభించనుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

షహనిల్ గిల్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *