Headlines

సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! | Vaibhav sooryavanshi net worth and brand endorsements at age 15

సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! | Vaibhav sooryavanshi net worth and brand endorsements at age 15


Vaibhav Sooryavanshi Net Worth: క్రికెట్ ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టిస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. సచిన్ టెండూల్కర్ రికార్డులను తిరగరాస్తూ టీమిండియాలోకి అడుగుపెట్టిన ఈ యువకెరటం, ఐపీఎల్ 2026 తర్వాత కమర్షియల్ ప్రపంచంలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. కొద్దిరోజుల్లోనే కోట్ల రూపాయల నికర విలువ సాధించి బ్రాండ్ల మైండ్ బ్లాక్ చేస్తున్నాడు.

భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ వేగం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 15 ఏళ్ల పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అతి పిన్న వయస్కుడైన రికార్డును సూర్యవంశీ బద్దలు కొట్టాడు. గ్రౌండ్‌లో అతను చూపిస్తున్న అద్భుతమైన ప్రతిభను చూసి దిగ్గజ కంపెనీలు అతనితో ఒప్పందాలు చేసుకోవడానికి క్యూ కడుతున్నాయి.

ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?

ఇవి కూడా చదవండి



రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2026 సీజన్‌లో అదరగొట్టిన తర్వాత ఈ యంగ్ సంచలనం కమర్షియల్ వ్యాల్యూ ఆకాశాన్ని తాకింది. ఇప్పుడు ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం కోటి రూపాయలకు పైగానే ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ జీతం, మ్యాచ్ ఫీజులు, డిజిటల్ ప్రకటనల నుంచి వస్తున్న ఆదాయంతో కలిపి ప్రస్తుతం అతని నికర విలువ దాదాపు 7 నుంచి 10 కోట్ల రూపాయల వరకు చేరిందని అంచనా వేస్తున్నారు.

టీనేజ్ స్టార్ కాపాడేందుకు కుటుంబం జాగ్రత్తలు..!

చిన్న వయసులోనే ఇంతటి భారీ డబ్బు, క్రేజ్ రావడం వల్ల ఆటపై దృష్టి మారకుండా సూర్యవంశీ కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరుసబెట్టి వచ్చే ప్రతి బ్రాండ్‌ను ఒప్పుకోకుండా, అతని ప్రతిష్టను పెంచే ఒప్పందాలను మాత్రమే ఎంపిక చేస్తున్నారు. అయినప్పటికీ ప్రచార వ్యాపార ప్రపంచంలో అతని పేరు ఒక సంచలనంగా మారింది.

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ప్రచారం చేస్తున్న టాప్ 5 బ్రాండ్లు ఏంటో ఒకసారి పరిశీలిస్తే:

ఎస్‌ఎస్ బ్యాట్స్ (సరీన్ స్పోర్ట్స్): ఒకప్పుడు సచిన్ అనగానే ఎంఆర్‌ఎఫ్ బ్యాట్ గుర్తుకొచ్చేది. సూర్యవంశీ ఇంకా ఏ పెద్ద కార్పొరేట్ కంపెనీతోనూ భారీ ఒప్పందం చేసుకోకపోయినప్పటికీ, ప్రముఖ కిట్ తయారీ సంస్థ ‘ఎస్‌ఎస్’తో ఏటా రూ.50 లక్షల విలువైన ఒప్పందం కలిగి ఉన్నాడు. సూర్యవంశీ పేరుతో ప్రత్యేకమైన బ్యాట్లను కూడా మార్కెట్లోకి తెచ్చారు.

కాంప్లాన్: 2026 ఆరంభంలో కాంప్లాన్ వారి “తొడా ప్లాన్, తొడా కాంప్లాన్” ప్రచారానికి వైభవ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. చిన్న వయసులోనే అథ్లెట్‌గా సరైన పోషకాహారంతో కష్టపడే అతని దినచర్యకు ఈ యాడ్ సరిగ్గా సరిపోతుంది.

ఎక్కువమంది చదివింది: Video: దమ్ముంటే ఒక్క సిక్స్ కొట్టంటూ రెచ్చగొట్టిన పాక్ దిగ్గజం.. 4 వరుస బంతుల్లోనే నోర్మూయించిన సచిన్..

గూగుల్ పే: యువతను ఆకట్టుకునేలా గూగుల్ పే చేసిన ప్రచారంలో వైభవ్ నటించాడు. తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాకు అనుసంధానించిన యుపిఐ ద్వారా టీనేజర్లు సురక్షితంగా డబ్బు ఎలా నిర్వహించాలో ఈ యాడ్ చూపిస్తుంది.

రెడ్ బుల్: ఐపీఎల్ 2026 సమయంలో తన రాజస్థాన్ రాయల్స్ సహచరుడు ధ్రువ్ జురెల్‌తో కలిసి రెడ్ బుల్ సవాలులో పాల్గొన్నాడు. 30 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన ఈ ఛాలెంజ్‌తో అలరించాడు.

జార్ఖండ్ ఆరోగ్య శాఖ: మే 2026లో జార్ఖండ్ ఆరోగ్య మంత్రి వైభవ్‌ను రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని యువతను ఆరోగ్యంగా, దృఢంగా ఉండేలా ప్రేరేపించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారత క్రికెట్‌లో కొత్త శకం..

ఇంత చిన్న వయసులోనే మైదానంలో పరుగులు రాబడుతూ, బయట కమర్షియల్ కింగ్‌గా ఎదుగుతున్న వైభవ్ ప్రయాణం అద్భుతం. సరైన మార్గదర్శకత్వం, స్థిరమైన ఆట తీరు ఉంటే రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌లో అతను సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. బ్రాండ్ ప్రపంచం కూడా అతని తదుపరి మైలురాళ్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *