Headlines

తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026.. డ్రోన్ బ్రాండింగ్‌తో కొత్త స్కీమ్ ఆవిష్కరణ.. | Pulkit TMT Hosts Grand Vijayotsavam 2026 Dealer Meet in Tirupati, Check Details

తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026.. డ్రోన్ బ్రాండింగ్‌తో కొత్త స్కీమ్ ఆవిష్కరణ.. | Pulkit TMT Hosts Grand Vijayotsavam 2026 Dealer Meet in Tirupati, Check Details


ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ పుల్కిత్ టిఎమ్‌టి తన వార్షిక డీలర్ల మహాసమ్మేళనం విజయోత్సవం 2026ను తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించింది. వ్యాపార పురోగతి, భాగస్వామ్యం, భవిష్యత్తు ప్రణాళికల లక్ష్యంగా జరిగిన ఈ వేడుకలో దాదాపు 150 మంది డీలర్లు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ వేడుకకు పుల్కిత్ టిఎమ్‌టి ఛైర్మన్ వినోద్ గార్గ్, సీఈవో పుష్పిత్ గార్గ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏవీపీ శరత్ మోహన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నాయకత్వం వహించారు. తమతో సుదీర్ఘకాలంగా ప్రయాణిస్తున్న డీలర్ల భాగస్వామ్యానికి, వారి కృషికి సంస్థ యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లక్ష్యాలను, వ్యాపార వ్యూహాలను ఈ సందర్భంగా డీలర్లతో పంచుకున్నారు.

 2026-27 స్కీమ్ ప్రారంభం

ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా 2026-27 కొత్త డీలర్ స్కీమ్ ఆవిష్కరణ నిలిచింది. స్టీల్ రంగ చరిత్రలోనే తొలిసారిగా డ్రోన్ బ్రాండింగ్, 200 అడుగుల భారీ డిజిటల్ స్క్రీన్ సహాయంతో వినూత్నంగా ఈ కొత్త స్కీమ్‌ను ప్రారంభించారు. అధునాతన సాంకేతికత, సరికొత్త బ్రాండింగ్ కలయికతో రూపొందించిన ఈ ప్రదర్శన డీలర్లను, ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.

విజేతలకు బహుమతుల ప్రదానం

2025 సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 38 మంది డీలర్లను పుల్కిత్ టిఎమ్‌టి యాజమాన్యం ప్రత్యేకంగా సత్కరించి, విలువైన బహుమతులను అందజేసింది.
అగ్రస్థానంలో నిలిచిన టాప్-3 డీలర్లు

  • మొదటి బహుమతి (మారుతి ఆల్టో K10 కార్): విజయలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ – బాలసుబ్రహ్మణ్యం రెడ్డి
  • రెండవ బహుమతి (రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్): క్వాలిటీ స్టీల్ షోప్ – శ్రీ వంశీకృష్ణ రెడ్డి
  • మూడవ బహుమతి (యామహా FZS బైక్): చెంచు లక్ష్మి స్టీల్ అండ్ సిమెంట్ – శ్రీ ప్రసాద్ రెడ్డి

అలోక్ ఇన్ఫోటెక్ నిర్వహణ

ఈ విజయోత్సవం 2026 ఈవెంట్‌ను అలోక్ ఇన్ఫోటెక్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈవెంట్ ప్రొడక్షన్, డీలర్ ఎంగేజ్‌మెంట్, డ్రోన్ బ్రాండింగ్, 200 అడుగుల స్క్రీన్ ఏర్పాటు వరకు ప్రతి అంశాన్ని అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి, ఈ వేడుకను ఓ చిరస్మరణీయ అనుభూతిగా మలిచింది. మొత్తానికి డీలర్ల సేవలను గుర్తిస్తూ, భవిష్యత్తు వృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసిన పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026 వేడుక అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

వీడియో చూడండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *