Headlines

Viral News: పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా? కట్‌చేస్తే.. అసలు ట్విస్ట్ ఇదే! | Gurugram Boat Protest: Private Company Fined Rs 50,000 by Traffic Police After Viral Post

Viral News: పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా? కట్‌చేస్తే.. అసలు ట్విస్ట్ ఇదే! | Gurugram Boat Protest: Private Company Fined Rs 50,000 by Traffic Police After Viral Post


ఏళ్ల తరబడి జనాలు ఎదుర్కొంటున్న సమస్యపై వ్యంగ్యంగా స్పందించిన ఆ సంస్థకు గురుగ్రామ్ పోలీసులు ఈ షాక్ ఇచ్చారు. గురుగ్రామ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీనివల్ల రవాణా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ సంస్థ అయిన కార్స్24 వినూత్న రీతిలో నిరసన తెలిపింది.

తమ కంపెనీ లోగో ఉన్న ఒక పడవను రోడ్డుపైకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ సంస్థ బ్రాండ్ అండ్ కమ్యూనికేషన్స్ హెడ్ ప్రాచీ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. వర్షాకాలంలో వచ్చే ఈ వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని, దీనిని నివారించడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకే తాము ఈ ప్రయత్నం చేశామని పేర్కొన్నారు.

ఆమె చేసిన పోస్ట్ కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసుల దృష్టికి చేరింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు, ఆ పడవను సీజ్ చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో సదరు సంస్థకు రూ. 50,000 జరిమానా విధించారు. దీనిపై ప్రాచీ శర్మ స్పందిస్తూ తన లింక్డ్‌ఇన్ ఖాతాలో మరో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రాచీ శర్మ తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో.. “గురుగ్రామ్‌లో చట్టాన్ని ఉల్లంఘించామనే ఆరోపణతో ప్రభుత్వం మాకు రూ. 50,000 ఫైన్ వేసింది. అదీ కూడా నదిలా మారిన రహదారిపై పడవ నడిపినందుకు! జరిమానా చలానా అయితే క్షణాల్లో వచ్చింది కానీ, స్థానికంగా ఏళ్ల తరబడి ప్రజలను వేధిస్తున్న సమస్య పరిష్కారంపై మాత్రం ఎవరికీ బాధ్యత లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే పోలీసులు మాత్రం.. ఈ ప్రచారాన్ని తోసిపుచ్చారు. పడవకు రూ.50వేల ఫైన్ వేశామనడంలో ఎలాంటి వాస్తవం లేదని.. ఇది తప్పుడు ప్రచారమని కొట్టి పడేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *