సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నయనతార, చాలా కాలంగా సినిమా ఈవెంట్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వేదికలపై సరిగ్గా మాట్లాడటం రాదన్న కారణంతో ఇంటర్వ్యూలకు, ఈవెంట్లకు నో చెబుతున్నారు. కానీ ఇటీవల కాలంలో నయన్ తన ప్రమోషన్ స్టైల్‌ను కాస్త మార్చారు.పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా ఉంటున్నా, వెరైటీ ప్రమోషనల్ వీడియోస్‌తో సందడి చేస్తున్నారు. ఆ మధ్య మన శంకరవరప్రసాద్ గారు కోసం స్పెషల్ వీడియోస్ చేసిన నయన్, ఇప్పుడు హాయ్ సినిమా కోసం ఇదే స్టైల్ ఫాలో అవుతున్నారు.ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న తన ‘నో ప్రమోషన్స్’ రూల్‌ను తన అప్ కమింగ్ మూవీ కోసం బ్రేక్ చేశారు నయనతార. ఆగస్టు 26న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ‘టాక్సిక్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం ఏకంగా బెంగళూరు వెళ్లారు. అంతేకాదు సాధారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉండే తాను ఈ ఈవెంట్ కు ఎందుకు వచ్చారో కూడా నయన్ క్లారిటీ ఇచ్చారు. మరి ఇక మీదట మిగతా సినిమాల విషయంలోనూ ఇదే స్టైల్ ఫాలో అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.