Headlines

Indian Railways: సామాన్యులకు రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. జనరల్ కోచుల్లో ప్రయాణించేవారికి పెద్ద రిలీఫ్.. ఇకపై.. | Indian Railways to Add More General Coaches: 3200 Long Distance Trains to Get More Seats

Indian Railways: సామాన్యులకు రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. జనరల్ కోచుల్లో ప్రయాణించేవారికి పెద్ద రిలీఫ్.. ఇకపై.. | Indian Railways to Add More General Coaches: 3200 Long Distance Trains to Get More Seats


రైల్వే ప్రయాణం చేసే సాధారణ ప్రయాణికులకు గుడ్ న్యూస్. పేదలు ఎక్కువగా జనరల్ కోచుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లల్లో కేవలం రెండు కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈ కోచ్‌లు కిక్కిరిసి ఉండటం వల్ల ఇబ్బందికరంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. జనరల్ కోచ్‌ల్లో వెళ్లే ప్రజలు ఎక్కువగా ఉండటం, కోచ్‌లు తక్కువగా ఉండటంతో ఈ సమస్య ఏర్పడింది. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు సిద్దమవుతోంది. 3200 దూరప్రాంత మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కోచ్‌ల సంఖ్య మరింత పెంచనుంది.

ప్రతీ రైల్లో 24 కోచ్‌లు ఉండేలా తీర్చిద్దిదాలని రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది. ఇందులో ఖచ్చితంగా నాలుగు జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. 6 నుంచి 8 వరకు స్లీపర్ కోచ్‌లు ఉండనున్నాయి. దీంతో జనరల్ కోచ్, స్లీపర్ కోచ్‌ల్లో వెళ్లే సాధారణ ప్రజలకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. ఈ కోచుల్లో లక్షలాది మంది ప్రయాణికులు దూర ప్రాంతాలకు జర్నీ చేస్తూ ఉంటారు. కోచ్‌ల సంఖ్య పెరగడం వల్ల పండుగల సమయంలో ఇళ్లకు వెళ్లే ప్రయాణికులకు సాధారణ కోచుల్లో సీటు లభించడం సులభం అవుతుంది. ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లల్లో కేవలం రెండు జనరల్ కోచ్‌లు మాత్రమే ఉండటం వల్ల సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని సమయాల్లో తొక్కిసలాటలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అలాగే రద్దీ కారణంగా కొతమంది ప్రయాణం చేయలేకపోతున్నారు. అయితే కోచ్‌ల సంఖ్యను పెంచడం వల్ల ఏటా అదనంగా 360 మిలియన్ల సీట్లు సృషించబడతాయని రైల్వేశాఖ చెబుతోంది.

అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయడం వల్ల పండుగ సమయాల్లో ఇళ్లకు వెళ్లేవారికి ప్రయోజనం చేకూరుతుంది. పండుగ సమయాల్లో ప్రయాణికుల్లో గందరగోళం కూడా తగ్గుతుంది. పండుగ సమయాల్లో వలస కార్మికులు తమ సొంత ఇళ్లకు చేరుకుంటారు. వీళ్లు ఎక్కువగా జనరల్ కోచుల్లోనే ప్రయాణం చేస్తారు. ఈ నిర్ణయం వీరికి ఎంతో ఉపయోగపడుతుంది. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేసే దిశగా రైల్వేశాఖ అడుగులు వేస్తోంది. ఇది అమల్లోకి వస్తే జనరల్ కోచుల సంఖ్య మరింత పెరుగుతుంది. దీని వల్ల సామాన్యులు కూడా సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం జనరల్ కోచ్‌ల్లో ప్రయాణం చేయాలంటే పెద్ద సాహసం చేయాల్సి వస్తోంది. వేలాడబడి మరీ ప్రయాణం చేస్తున్నారు. దీని వల్ల రైళ్ల నుంచి కింద పడి మరణించే ఘటనలు కూాడా చోటుచేసుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *