Headlines

OTT Movie: కేరళను కుదిపేసిన దారుణ ఘటన.. ఓటీటీలో బుర్రపాడు చేసే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు | This Crime Thriller Movie Based On Real Story Streaming Now On Netflix OTT Will Blow Your Mind

OTT Movie: కేరళను కుదిపేసిన దారుణ ఘటన.. ఓటీటీలో బుర్రపాడు చేసే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు | This Crime Thriller Movie Based On Real Story Streaming Now On Netflix OTT Will Blow Your Mind


ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అన్ని రకాల సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటాయి. అయితే ఈ మధ్యన ఆడియెన్స్ ఎక్కువగా సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్ సినిమాలకే ఓటేస్తున్నారు. అందులోనూ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కే క్రైమ్ థ్రిల్లర్లకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై మంచి ఆదరణ దక్కతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇదొక రియల్ క్రైమ్ స్టోరీ. కేరళలో 2021లో జరిగిన ఒక దారుణమైన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఏకంగా తొమ్మిది మంది అమాయక అమ్మాయిలను దారుణంగా హతమార్చిన స్టీఫెన్ జబరాజ్ అనే సీరియల్ కిల్లర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఒక్కసారి చూడటం మొదలుపెడితే, సినిమా మొత్తం పూర్తయ్యే వరకు మీరు మీ సీటులోంచి లేవలేరు. ఇందులోని మలుపులు, సన్నివేశాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.ఇ క ఈ మూవీ క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించలేరు. అమ్మాయిలను హత మార్చడం, పోలీసులు పట్టుకునే లోపే అతడే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోవడం, కోర్టులో కూడా నేరాన్ని అంగీకరించడం ఈ కథలో అతి పెద్ద ట్విస్టులు. మరి స్టీఫెన్ ఈ దారుణాలకు ఎందుకు పాల్పడ్డాడు? అసలు అతని గతమేంటి? పోలీసుల విచారణలో ఏం తేలింది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.

ఓటీటీ హిస్టరీలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా నిలిచిన ఈ సినిమా పేరు ‘స్టీఫెన్’. మిథున్ బాలాజీ స్వయంగా కథ అందించి తెరకెక్కించిన ఈ సినిమాలో గోమతి శంకర్‌ సైకో కిల్లర్ గా అద్భుతంగా నటించాడు. అతనితో పాటు మైఖేల్ తంగదురై, స్మృతి వెంకట్, కుబేరన్, విజయశ్రీ, అమర రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. గతేడాది డిసెంబర్ 05 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ వంటి వివిధ భాషలలోనూ ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి



స్టీఫెన్ సినిమాలో గోమతి శంకర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *