Headlines

అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది | Do you know how Bathukamma Movie actress Sindhu Tolani looks now

అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది | Do you know how Bathukamma Movie actress Sindhu Tolani looks now


ఒకప్పటి ఎవర్ గ్రీన్ హీరోయిన్ సింధు తులాని గుర్తుందా.! క్యూట్ రోల్స్ చేస్తూనే, గ్లామరస్ గర్ల్‌గా మెరిసిన ఆమె, ఎట్ ఏ టైమ్ ఆర్టిస్ట్‌గా తన ప్రతిభను చాటుకున్నారు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సింధు, ఐతే చిత్రంతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో సుల్లాన్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. శింబుతో కలిసి నటించిన మన్మధ ఆమె కెరీర్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది, తమిళంలోనే కాకుండా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ సంచలనం సృష్టించింది. తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతడొక్కడే చిత్రం సింధు తులాని కెరీర్‌లో మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. కన్నడలో రిషి, తమిళంలో అలై ఎదుకుత్తు వంటి చిత్రాలు చేసినప్పటికీ, ఆమెకు ఆ ఏడాది అతడొక్కడే విజయాన్ని అందించింది. హీరోయిన్‌గా హిట్స్ కొడుతూనే, మజా వంటి చిత్రాలతో ఐటెం సాంగ్స్‌కు కూడా చిందేసిమెప్పించింది. ఏదో ఒక రకమైన పాత్రకు పరిమితం కాకుండా, పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న రోల్స్‌తో పాటు గ్లామరస్ గర్ల్‌గా కూడా ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..! ఈ నటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

తక్కువ సమయంలోనే క్యూట్ కుట్టీగా గుర్తింపు తెచ్చుకున్న సింధు తులాని, గౌతమ్ ఎస్ఎస్సీలో హీరోయిన్‌గా నటించారు. ఆ కాలంలో ఎక్కువగా రొమాంటిక్ డ్రామాలలో కనిపించిన ఆమె, సరదా సరదాగా వంటి చిత్రాలతో తెలుగు తెరపై మెరిశారు. ఆ తర్వాత పోతే పోనీ వంటి సోషల్ అవేర్‌నెస్ సినిమాల్లో కూడా మెస్మరైజ్ చేసింది. పౌర్ణమి చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా అద్భుతంగా నటించి మెప్పించారు. కెరీర్‌లో చాలా వేగంగా వెలగడమే కాకుండా, అతి వేగంగా ప్రయోగాలు చేసిన హీరోయిన్‌గా కూడా సింధు తులాని గుర్తింపు పొందారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కలర్‌ఫుల్ రోల్స్‌తో పాటు డి-గ్లామరస్ క్యారెక్టర్స్‌ను కూడా పోషించారు. దక్షిణాదిలో గ్లామరస్ హీరోయిన్‌గా ఫోకస్ అయిన సింధు, 50 లాక్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లరి నరేష్ చిత్రం విశాఖ ఎక్స్‌ప్రెస్లో తళుక్కుమంది.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి : సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది: నాగార్జున

అన్ని మీడియం రేంజ్ ప్రయోగాలే చేస్తూ వచ్చినా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సింధు తులాని. ఆమె కెరీర్‌లో బతుకమ్మ చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది. గ్లామరస్ రోల్స్‌తో మెప్పించిన ఆమె, ట్రాక్ మార్చి చేసిన ఈ సినిమా సింధు తులానికి నటిగా స్పెషల్ ఇమేజ్ తెచ్చింది. ఈ మూవీ తర్వాత హరేరామ్, బ్లాక్ అండ్ వైట్ వంటి చిత్రాలతో మళ్లీ గ్లామరస్ రోల్స్‌లో కనిపించినప్పటికీ, తన కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం బతుకమ్మనే. స్టార్ హీరోయిన్‌గా వెలిగి, ప్యారలల్‌గా సైడ్ రోల్స్ వేసిన అతి కొద్ది మంది హీరోయిన్స్‌లో సింధు తులాని ఒకరు. తమిళ చిత్రం పందెంలో విభిన్న పాత్ర పోషించారు. ప్రేమ కావాలి, దగ్గరగా దూరంగా వంటి చిత్రాలలో సైడ్ రోల్స్‌తో కెరీర్ కంటిన్యూ చేస్తోంది సింధు. చివరగా వదినగా, అక్కగా, పిన్నిగా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ అందాల తార ఇప్పుడు ఎలా ఉందంటే..

ఇది కూడా చదవండి : అయ్యో పాపం.. కళ్ళు చిదంబరం కళ్ళ వెనక ఇంతా కథ ఉందా.! తెలిస్తే షాక్ అవుతారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *