Headlines

ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు విద్యార్థినులకు కాటు! | Rats Terrorize Girls’ Residential School in Khammam, Six Students Bitten in Three Days

ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు విద్యార్థినులకు కాటు! | Rats Terrorize Girls’ Residential School in Khammam, Six Students Bitten in Three Days


అది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లెల గురుకుల పాఠశాల. ఈ పాఠశాలలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు ఆ పాఠశాలను ఎలుకలు భయపెడుతున్నాయి. ఎటు చూసినా ఎలుకల బెడదతో విద్యార్థినిలు హడలి పోతున్నారు. ఆ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినిలు నిద్రించేందుకు ప్రత్యేక గదులు ఉన్నాయి. కానీ, నిర్వహణ లోపం కారణంగా విద్యార్థులకు ఎలుకలు బెడద ఎక్కువైంది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థులను ఎలకలు కరిచాయి.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెలలోని బాలికల గురుకులంలో ఎలుకలు విద్యార్థినులను కరిచిన ఘటన కలకలం రేపింది. బాలికల గురుకులంలో చదువుతున్న ఆరుగురు విద్యార్థినులను ఎలుకలు కరవడంతో స్థానిక లంకాసాగర్ ప్రాథమిక ఆసుపత్రికి వెళ్లి చికిత్స అందించారు. తరచుగా గురుకులంలో ఎలుకలు విద్యార్థినులను కరవడం జరుగుతుందని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. దీని పై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు మాట్లాడుతూ.. గురుకులంలో విద్యార్ధులను ఎలుకలు కరిచాయని ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి రావడం జరిగింది. ఎలుకలు కరిచిన విద్యార్థినులకు చికిత్స అందించినట్టు తెలిపారు. గురుకులంలో ఎలుకల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని సరిగా నిద్రపోయే పరిస్థితులు కూడా లేవని విద్యార్థులు వాపోతున్నారు. భయంతో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులను ఆందోళన మొదలైంది. ఇక్కడ పరిసరాలు పరిశుభ్రంగా లేదని, పాములు విష కీటకాలు వచ్చే ప్రమాదం ఉందని విద్యార్థినుల భద్రతపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్, ఇటు మీడియాకు లోపలికి అనుమతి లేకపోవడంతో గురుకుల హాస్టల్‌లో ఏం జరుగుతుందో తెలియనీ పరిస్థితి నెలకొందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *