Headlines

Asha Chocolate: ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ‘ఆశ చాక్లెట్’ ఇప్పుడు ఎందుకు కనుమరుగైపోయింది? అసలు కారణాలివే! | The Rise and Fall of Asha Chocolate: Why Did the 90s Favorite Sweet Magic Disappear?

Asha Chocolate: ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ‘ఆశ చాక్లెట్’ ఇప్పుడు ఎందుకు కనుమరుగైపోయింది? అసలు కారణాలివే! | The Rise and Fall of Asha Chocolate: Why Did the 90s Favorite Sweet Magic Disappear?


Asha Chocolate: అప్పటి కాలంలో పుట్టి పెరిగిన వారికి ఆశ చాక్లెట్‌ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కనుమరుగైపోయాయి. అప్పట్లో ఈ ఆశ చాక్లెట్లకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. పాఠశాల బెల్ మోగగానే జేబులో ఉన్న 25 పైసలు, 50 పైసలు లేదా రూపాయి నాణేన్ని పట్టుకుని కిరాణ కొట్టుకు వెళ్లి ముందుగా కొనేది ఆశ చాక్లెట్‌. అప్పట్లో ఈ చాక్లెట్లకు ఉన్న డిమాండే వేరు. అంతే కాదు ఈ చాక్లెట్‌ రుచికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ చాక్లెట్లకు చిన్ననాటి తీపి జ్ఞాపకాలలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఇవి ఎందుకు కనుమరుగైపోయాయి. ఈ రోజుల్లో ఏదైనా వస్తువుకు డిమాండ్‌ ఉంటే వ్యాపారం మరింతగా అభివృద్ధి చెంది ఆ ప్రొడక్ట్‌ మరింతగా విస్తరించుకునేలా చర్యలు చేపడుతుంటాయి కంపెనీలు. కానీ అప్పట్లో అంత క్రేజ్‌ ఉన్న ఈ చాక్లెట్లు ఎందుకు నిలిచిపోయాయి? అయితే దీని వెనుక ఉన్న కారణాలను తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Indian Railways: మారిన రైల్వే రూల్స్‌.. ఈ పొరపాట్లు చేస్తే జరిమానా పది రేట్లు పెంపు.. జైలు శిక్ష..!

ఆశ చాక్లెట్స్ ఎవరు ప్రారంభించారు?

ఆశ చాక్లెట్‌ను ఏపీలోని చిత్తూరుకు చెందిన ప్రముఖ ‘నూట్రిన్ కాన్ఫెక్షనరీ’ (Nutrine Confectionery) సంస్థ తయారు చేసింది. ఈ కంపెనీని 1952లో బి. వెంకటరామరెడ్డి గారు స్థాపించగా, ఆ తర్వాత ఆయన కుమారుడు ద్వారకానాథ్ రెడ్డి దీనిని భారతీయ మార్కెట్‌లో అగ్రగామి బ్రాండ్‌గా ఎదిగేలా చేశారు. అ కంపెనీ చిత్తూరు జిల్లాలో మొదలైంది. మన దేశంలోనే కాదు దాదాపు 10 దేశాల్లో ఆశా చక్లెట్ ఎగుమతులు, విక్రయాలు జరిగాయి.
ధర తక్కువే..

ఇవి కూడా చదవండి



ఆశ చాక్లెట్ సాధించిన అపారమైన విజయంలో దాని ‘ధర’. ఎందుకంటే సామాన్యులకు అతి తక్కువ ధరల్లో లభించడం, మంచి రుచి ఉండటం ప్రాచూర్యం పొందింది. ఈ చాక్లెట్‌ ధర 25 పైసలు, 50 పైసలు ఆతర్వాత కాలంలో రూపాయి ధరల్లో లభించడం వల్ల సామాన్య కుటుంబాల పిల్లలకు ఇది ఎంతో అందుబాటులో ఉండేది. అయితే కాలక్రమేణా చాక్లెట్ తయారీకి కావలసిన ప్రధాన ముడిసరుకులైన కోకో (Cocoa), పాలు, చక్కెర, ప్యాకింగ్ కవర్ల ధరలు భారీగా పెరిగాయి. రూపాయి కంటే ధర పెంచితే పిల్లలు కొనుగోలు చేయకపోవచ్చనే భయం, ఒకవేళ రూపాయికే అమ్మితే భారీ నష్టాలు రావడం వల్ల కంపెనీ ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చిందని తెలుస్తోంది.

ఆశపై విదేశీ బ్రాండ్ల దెబ్బ..

మార్కెట్లో ఎంతో క్రేజ్‌ ఉన్న ఆశ చాక్లెట్లకు విదేశీ బ్రాండ్లు భారీ దెబ్బ కొట్టాయి.మార్కెట్లో మంచి బ్రాండ్‌గా ఎదిగిన ఆశ చాక్లెట్లపై విదేశీ సంస్థలు దృష్టి సారించాయి. ఇక్కడి చాక్లెట్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారన్ని చిన్నగా విస్తరించారు. కాడ్బరీ (Cadbury), నెస్లే (Nestle), పర్ఫెట్టి వాన్ మెల్లే (Perfetti Van Melle – ఆల్పెన్‌లీబే, సెంటర్ ఫ్రెష్) వంటి అంతర్జాతీయ బహుళ జాతీయ (MNC) కంపెనీలు భారీ స్థాయిలో ప్రవేశించాయి. అప్పటి నంచి ఆశ చాక్లెట్లకు భారీ దెబ్బ తగిలింది. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లు, రకరకాల ఫ్లేవర్లు, టీవీలలో నిరంతరం భారీ ప్రకటనలు (Advertisements) గుప్పించి పిల్లల దృష్టిని తమవైపు తిప్పుకున్నాయి.

ఆశ చాక్లెట్స్ ఎప్పుడు నిలిచిపోయాయి?

ఇదిలా ఉండగా, ఆశ చాక్లెట్లకు కాలక్రమేణా పోటీ పెరగడం మొదలైన తర్వాత క్రమంగా నిలిచిపోవడం ప్రారంభమైంది. 2006లో నూట్రిన్ కంపెనీ తన వ్యాపారాన్ని ప్రముఖ ‘గోద్రేజ్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్’ (Godrej Foods and Beverages) సంస్థకు సుమారు రూ. 260 కోట్లకు అమ్మేసింది. ఆ తర్వాత గోద్రేజ్ సంస్థ కూడా మెయింటేన్ చేయలేక.. కొన్నాళ్లకు అమెరికాకు చెందిన ప్రముఖ ‘హెర్షేస్’ (Hershey’s) సంస్థతో కలిసి ‘గోద్రేజ్ హెర్షేస్’గా వ్యాపారం సాగించింది. గోద్రేజ్ విలీనం తర్వాత కూడా తీవ్రమైన మార్కెట్ పోటీ వల్ల 2008-2010 కాలం నాటికి ఆశ చాక్లెట్ల ఉత్పత్తి దాదాపు పూర్తిగా నిలిచిపోయింది.

ఇది కూడా చదవండి: Bullet Train: గుడ్‌న్యూస్‌.. పట్టాలెక్కనున్న భారతదేశపు తొలి బులెట్ ట్రైన్.. బిగ్ అప్‌డేట్!

ఇది కూడా చదవండి: House Construction: 1000 చదరపు అడుగుల ఇంటి నిర్మాణంలో కేవలం స్లాబ్‌ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? పూర్తి లెక్కలివే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *