Headlines

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం బ్యాడ్ న్యూస్.. విత్ డ్రా రూల్స్‌లో బిగ్ ఛేంజ్.. ఇకపై డబ్బులు తీసుకోలేరు..

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం బ్యాడ్ న్యూస్.. విత్ డ్రా రూల్స్‌లో బిగ్ ఛేంజ్.. ఇకపై డబ్బులు తీసుకోలేరు..


EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం బ్యాడ్ న్యూస్.. విత్ డ్రా రూల్స్‌లో బిగ్ ఛేంజ్.. ఇకపై డబ్బులు తీసుకోలేరు..

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. ఇకపై ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ ఫైనల్ సెటిల్‌మెంట్, పెన్షన్ అమౌంట్ విత్ డ్రా కోసం సుదీర్ఘ కాలం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉండదు. ఉద్యోగం మానేశాక కేవలం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం మాత్రమే ఉపసంహరించుకోగలరు. మిగతా 25 శాతం తీసుకోవాలంటే కొన్ని నెలల పాటు ఆగాల్సింది. ఇక పెన్షన్ అమౌంట్ తీసుకోవాలన్నా ఏళ్ల పాటు వేచి ఉండాలి. ఈ విషయాన్ని పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గతంలో ఉన్న పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది.

గతంలో ఉద్యోగం మానేసిన తర్వాత రెండు నెలల పాటు వేరే కంపెనీలో చేరకపోతే పీఎఫ్ బ్యాలెన్స్, పెన్షన్ అమౌంట్ మొత్తం విత్ డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు వెంటనే నగదు మొత్తం తీసుకోలేరు. ఉద్యోగం మానేశాక వెంటనే మీ పీఎఫ్ నగదులో 75 శాతం వరకు తీసుకోవచ్చు. మిగతా 25 శాతం అమౌంట్‌ తీసుకోవాలంటే 12 నెలల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. గతంలో రెండు నెలలుగా ఉన్న కాలాన్ని ఇప్పుడు ఏడాదికి మార్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఇక పెన్షన్ అమౌంట్ విత్ డ్రా చేసుకోవాలంటే 3 నెలల పాటు వెయిట్ చేయాలి. గతంలో రెండు నెలలుగా ఉన్న నిరీక్షణ కాలాన్ని ఇప్పుడు మూడేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ భద్రతను కాపాడేందుకు ఈ సుదీర్ఘ నిరీక్షణ కాలం విధించినట్లు కార్మికశాఖ తెలిపింది. ఉద్యోగికి ఆర్ధిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

సభ్యులు తమ పింఛను ఖాతాలను గడువుకు ముందే మూసివేసి భవిష్యత్తు పింఛను అర్హతను కోల్పోకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. 36 నెలల నిరీక్షణ కాలాన్ని తగ్గించడం లేదా దానిని వెనక్కి తీసుకునే ప్రతిపాదన ప్రస్తుతానికి ఏమీ లేదని కార్మికశాఖ తెలిపింది. దీనికి బదులుగా పీఎఫ్ ముందస్తు విత్ డ్రా, క్లెయిమ్ పరిష్కారానికి సంబంధించి ప్రక్రియను వేగవంతం చేసినట్లు స్పష్టం చేసింది. వైద్య అత్యవసర పరిస్థితులు, విద్య, గృహవసతి కారణాలుగా చూపి బ్యాలెన్స్‌లో 75 శాతం ముందస్తుగా విత్ డ్రా చేసుకోవచ్చంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 31,11,343 మంది సభ్యులు 10 సంవత్సరాల పింఛను అర్హత గల సర్వీసును పూర్తి చేయకుండానే తమ పింఛను ఖాతాలను గడువుకు ముందే మూసివేశారని, దీనివల్ల వారు పింఛనుకు అనర్హులయ్యారని స్పష్టం చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *