Headlines

Independence Day : 24 సంవత్సరాలైనా తగ్గని క్రేజ్.. ఇండిపెండెన్స్ డే అంటే ఆ సాంగ్ ఉండాల్సిందే.. వింటే గూస్ బంప్స్ పక్కా.. | 24 Years On, The Craze Unfaded, Independence Day Celebrations Are Incomplete Without This Song, That Is Meme Indians Song

Independence Day : 24 సంవత్సరాలైనా తగ్గని క్రేజ్.. ఇండిపెండెన్స్ డే అంటే ఆ సాంగ్ ఉండాల్సిందే.. వింటే గూస్ బంప్స్ పక్కా.. | 24 Years On, The Craze Unfaded, Independence Day Celebrations Are Incomplete Without This Song, That Is Meme Indians Song


దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. మరోవైపు అన్ని రాష్ట్రాల్లో.. నగరాల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జెండా వందనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ దేశవ్యాప్తంగా మిఠాయిలు పంచుకుని, దేశభక్తి గీతాలు ఆలపిస్తారు. ఇదిలా ఉంటే.. ఇండిపెండెన్స్ డే అంటే చాలు ఒక పాట యూట్యూబ్, సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఆ సినిమా, పాట విడుదలై 24 సంవత్సరాలు దాటినప్పటికీ సాంగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సాంగ్ తెలుగు సినిమా ప్రపంచంలో అత్యధిక దేశభక్తి ఉన్న గీతాలలో ఒకటి అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు కూడా సోషల్ మీడియా ప్రపంచాన్ని ఆ సాంగ్ ఊపేస్తుంది. మనం మాట్లాడుకుంటున్న సాంగ్ పేరు మేమే ఇండియన్స్. డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన ఖడ్గం సినిమాలోనిది ఈ పాట. తెలుగు రాష్ట్రాల్లో ఈ పాటకు ఉండే వైబ్ గురించి చెప్పక్కర్లేదు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి..

2002లో వచ్చిన ఖడ్గం సినిమాకు కి కృష్ణవంశీ దర్శకత్వం వహించగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ పాటకే హైలెట్ అని చెప్పాలి. సాధారణ దేశభక్తి పాటల కంటే భిన్నంగా, భారతీయుల గొప్పతనాన్ని పొగుడుతూనే, మనలోని అమాయకత్వం, తికమకలు, నిత్య జీవితంలో ఎదురయ్యే వైరుధ్యాలను చాలా సరదాగా ఈ పాటలో చూపించారు. రిహద్దుల్లో పోరాడే సైనికులకే కాకుండా, రోజువారీ జీవితంలో కష్టపడే ప్రతి సామాన్య భారతీయుడికి ఈ పాట ఒక ప్రతిరూపంలా నిలుస్తుంది. ఆత్మగౌరవం, జాతీయ సమైక్యత మరియు ప్రతికూల పరిస్థితుల్లో కూడా చెరగని చిరునవ్వుతో ముందుకు సాగే భారతీయ తత్వాన్ని ఈ పాట అద్భుతంగా ఆవిష్కరించింది.

ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

‘ఖడ్గం’ చిత్రం తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే అత్యుత్తమ దేశభక్తి యాక్షన్ డ్రామాల్లో ఒకటి. సుంకర మధుమురళి కార్తికేయ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బెంద్రే, సంగీత , కిమ్ శర్మ ప్రధాన పాత్రలలో నటించారు. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథ వేర్వేరు నేపథ్యాలు ఉన్న ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతిలో ప్రేయసి (సోనాలి బెంద్రే)ని కోల్పోయి, ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే ధ్యేయంగా పనిచేసే ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీకాంత్.. సినీ పరిశ్రమలో నటుడిగా నిలదొక్కుకోవాలని కష్టపడే ఒక ఉత్సాహవంతుడైన యువకుడిగా రవితేజ, దేశంపై అమితమైన ప్రేమ ఉన్న ఒక ఆటో/టాక్సీ డ్రైవర్ అంజాద్ భాయ్ గా ప్రకాష్ రాజ్ నటించారు. ఇప్పటికీ ప్రతి స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవం రోజుల్లో ఈ సినిమా టీవీల్లో రావాల్సిందే.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

మేమే ఇండియన్స్ సాంగ్..



ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *