Headlines

ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై ఎన్‌ఈసీసీ సంచలన నివేదిక! | India Produces 13,800 Crore Eggs Annually, But 1,000 Crore Are Wasted in Transit video tv9d – Business Videos in Telugu


భారతదేశంలో గుడ్ల ఉత్పత్తి, వినియోగానికి సంబంధించి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 25 వేల మందికి పైగా పౌల్ట్రీ రైతులు సభ్యులుగా ఉన్న ఎన్‌ఈసీసీ, దేశంలో రోజువారీ గుడ్డు ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం మన దేశ పౌల్ట్రీ రంగం సుమారు రూ.1,14,000 కోట్ల విలువతో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం భారత్ ఏటా 13,800 కోట్ల గుడ్లను ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద గుడ్ల ఉత్పత్తిదారుగా నిలిచింది. అయితే ఇందులో కేవలం 11,000 కోట్ల గుడ్లు మాత్రమే వినియోగదారులకు చేరుతున్నాయి. సరైన రవాణా వసతులు లేకపోవడం, లాజిస్టిక్ లోపాల కారణంగా ఏటా దాదాపు 1,000 కోట్ల గుడ్లు మధ్యలోనే పగిలిపోయి వృథా అవుతున్నాయని ‘ఇంక్‌-42’ తన అధ్యయనంలో స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర.. ఇలా కొన్ని రాష్ట్రాలు గుడ్ల ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాయి. మరోవైపు దేశంలో తలసరి గుడ్ల వినియోగం ఇంకా ఆశించిన స్థాయిలో లేదని నివేదిక పేర్కొంది. ఒక భారతీయుడు ఏడాదికి సగటున కేవలం 101 గుడ్లను మాత్రమే తింటున్నాడు. ఈ వినియోగం ప్రపంచ సగటుతో పోలిస్తే ఏకంగా 44 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. పౌల్ట్రీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, రవాణా నష్టాలను తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

10వ తరగతి అర్హతతో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!

నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!

Google Drive: గూగుల్ డ్రైవ్ వాడేవారికి అలర్ట్‌.. ఫొటోల బ్యాకప్ విషయంలో కీలక మార్పులు

Monsoon Update: పసిఫిక్‌లో ఎల్‌నినో సెగ.. భారత్‌లో నిలకడగా రుతుపవనాలు.. కరువు భయం లేనట్లే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *