Headlines

Central Government: రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. ఒకేసారి ఐదు పథకాలు.. పండుగే.. పండుగ.. | 5 Key Government Schemes Every Indian Farmer Should Know About


దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వీటి ద్వారా దేశంలోని ప్రతీఒక్క రైతు ప్రయోజనం పొందవచ్చు. కానీ చాలామందికి వీటి గురించి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నేరుగా నగదు అందించడంతో పాటు వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సిడీ, ఎరువులపై సబ్సిడీ, పంటకు బీమా వంటి పథకాలు అమలు చేస్తోంది. ఈ ప్రయోజనాలను అందుకోవడం వల్ల భారీగా డబ్బులను పొదుపు చేసుకోవచ్చు. ప్రధానంగా రైతుల కోసం 5 పథకాలు అమల్లో ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎం కిసాన్

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైన పథకం పీఎం కిసాన్. ఈ పథకం ద్వారా ప్రతీ ఏడాది రైతులకు రూ.6 వేల చొప్పున కేంద్రం అందిస్తోంది. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా జమ చేస్తోంది. 5 ఎకరాల్లోపు పోలం కలిగి ఉన్నవారు ఈ స్కీమ్‌కు అర్హులు. భూమి రికార్డులు మీ పేరు మీద ఉండాలి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ ప్రయోజనం అందుతుంది.

పంట బీమా పథకం

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులు సాగు చేసే పంటలకు కేంద్రం బీమా సౌకర్యం కల్పిస్తోంది. కేవలం తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, క్రిమికీటకాల వల్ల పంటకు నష్టం జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం అందిస్తాయి. వడగళ్లు, వరదలు, వర్షాలు, కరువు, తెగుళ్లు, క్రిమికీటకాలు వంటి పరిస్థితుల వల్ల పంటకు నష్టం జరిగితే బీమా సొమ్ము అందుతుంది. నష్టం జరిగిన వెంటనే స్థానిక వ్యవసాయ అధికారి లేదా బీమా కంపెనీకి తెలపాలి,

కేంద్రం నుంచి రాయితీలు

ఇక బిందు సేద్యం, స్ప్రింక్లర్ వ్యవస్థలు,సూక్ష్మ సేద్యం వంటి సాంకేతికతలను అవలంబించే రైతులకు కేంద్రం రాయితీలను అందిస్తోంది. వీటి వల్ల పంట దిగబడి పెరగడమే కాకుండా నీరు ఆదా అవుతుంది.

భూసార పరీక్షలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహిస్తాయి. దీని వల్ల మీ పంట భూమి సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. ఏయే పంటకు భూమి అనుకూలంగా ఉందనే విషయాలు తెలుసుకోవచ్చు. మీ నేల ఆరోగ్యాన్ని ఈ వివరాల ద్వారా మెరుగుపపర్చుకోవచ్చు. ఏయే ఎరువులు వేయాలో.. ఏ పోషకాలు లోపించాయనేది తెలుసుకోవచ్చు.

వ్యవసాయ యంత్రాలపై రాయితీ

ఇక వ్యవసాయ పరికరాలు, యంత్రాలపై రాయితీ పొందవచ్చు. ట్రాక్టర్లు, త్రెషర్లు, రీపర్లు, పవర్ టిల్లర్ల వంటి యత్రాల కొనుగోలపై రాయితీ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *