Headlines

చెన్నై పంద్రాగస్టు వేడుకల్లో మెరిసిన త్రిష.. విజ‌య్ పేరెంట్స్‌తో కలిసి.. | Trisha Attends Independence Day Event With CM Vijay, Fueling Relationship Rumours video – Entertainment Videos in Telugu


తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత జీవితంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నటి త్రిషతో ఆయన బంధం గురించిన వార్తలు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో త్రిష ప్రత్యక్షం కావడం ఈ చర్చలకు మరింత బలాన్నిచ్చింది. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో నేడు ఘనంగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం హోదాలో విజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ అధికారిక ప్రభుత్వ వేడుకలకు నటి త్రిష ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అతిథుల కోసం కేటాయించిన వీఐపీ ముందు వరుసలో ఆమె ఆసీనులయ్యారు. ముఖ్యంగా త్రిష పక్కనే విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా బంగారు వర్ణం చీరలో, ఎంతో హుందాగా, సంప్రదాయబద్ధంగా కనిపించిన త్రిష.. చుట్టూ ఉన్నవారితో నవ్వుతూ, ముచ్చటిస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేడుకకు కూడా త్రిష హాజరయ్యారు. ఇప్పుడు ఇలా స్వాతంత్ర్య వేడుకల్లోనూ విజయ్ కుటుంబంతో కలిసి కనిపించడంతో, వీరిద్దరి మధ్య రిలేషన్‌షిప్ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ పరిణామాలు ప్రస్తుతం తమిళ సినీ మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తుపాకులు వదిలి ర్యాంప్‌పైకి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు..

ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు

ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వారి వల్ల కాలేదు.. చివరికి ఇలా..!

ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు!

మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *