Headlines

OTT Movie: ఓటీటీని ఊపేస్తోన్న తెలుగు బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్.. ట్రెండింగ్ లో టాప్ ప్లేస్.. పెద్దలకు మాత్రమే | Apsara Rani Bold Dark Secrets Movie Trending At The Top On Amazon Prime Video OTT


సెన్సార్ సమస్యలు, బడ్జెట్, ఇతరత్రా కారణాలతో థియేటర్లలో రిలీజ్ కాని సినిమాలకు ఇప్పుడు ఓటీటీలు పెద్ద వరంగా మారాయి. ముఖ్యంగా రిలీజ్ కు నోచుకోలేకపోతున్న చిన్న సినిమాలకు ఓటీటీలే పెద్ద దిక్కు అవుతున్నాయి. అలా డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చిన ఓ తెలుగు సినిమా ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ ఇండియా వ్యాప్తంగా అత్యధిక కొనుగోళ్లు సాధించిన ‘టాప్ 10 పర్చేసెస్’ (Top 10 Purchases in India) విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ పద్ధతిలో (రూ.99) అందుబాటులో ఉంది. అయినా కూడా జనాలు డబ్బులు కట్టి మరీ ఈ తెలుగు సినిమాను తెగ చూసేస్తున్నారు. దీనికి తోడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో హిందీ, తమిళ, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్.. ఇలా ఎన్నో భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. అయితే వీటన్నింటినీ వెనక్కినెట్టి ఒక తెలుగు సినిమా టాప్ ప్లేస్ లో నిలిచింది.

ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండ్ లో దూసుకుపోతోన్న ఈ సినిమా పేరు ‘డార్క్ సీక్రెట్స్’. గతంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘థ్రిల్లర్’, ‘డేంజరస్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అప్సర రాణి ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించింది. అలాగే జయశ్రీ అజిత్ రాధారం, మోహిత్ రెహ్మానియాక్, అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం, నైనిక అనసూయ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. అవినాష్ కొకటి దర్శకత్వం వహించారు. ‘టచ్‌వుడ్ టేల్స్’ బ్యానర్‌పై అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా డార్క్ సీక్రెట్స్ సినిమాకు ఐఎమ్ డీబీలోనూ పదికి 7.7 రేటింగ్ ఉంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీంతో ఓటీటీలో ఈ బోల్డ్ మిస్టరీ థ్రిల్లర్ కు భారీగా వ్యూయర్ షిప్ వస్తోంది. డార్క్ సీక్రెట్స్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. టైటిల్ కు తగ్గట్టుగానే “ప్రతి మనిషి జీవితంలో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యం బయటపడితే ఏమవుతుంది?” అనే ప్రధాన అంశాన్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమాను మలిచారు. మనుషుల జీవితాల్లో దాగి ఉన్న అసాధారణ రహస్యాలు, కోరికలు, భావోద్వేగాలు, సంబంధాల సంక్లిష్టతల చుట్టూ ఈ సినిమా కథలు తిరుగుతాయి. అయితే ఇది బోల్డ్ సినిమా కాబట్టి పిల్లలతో కలిసి చూడకపోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *