Headlines

ఇది కదా సినిమా అంటే..! 66 రోజుల్లో తీసిన మూవీ ఏకంగా.. 17 5 రోజులు థియేటర్స్‌లో ఆడింది.. | Director V.N. Aditya Reflects on Mahesh Babus Okkadu Journey and 66 Day Industry Hit Manasantha Nuvve


ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయాలను, ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తనకున్న ప్లాన్స్ అలాగే మనసంతా నువ్వే వంటి విజయవంతమైన చిత్రాల నిర్మాణ నేపథ్యాన్ని వివరించారు. దర్శకుడు వి.ఎన్. ఆదిత్యకు మహేష్ బాబుతో ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం వచ్చినప్పుడు, ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. నిర్మాత ఏంఎస్ రాజు మహేష్ తో మనసంతా నువ్వే చేద్దాం అని చెప్పినప్పుడు నేను ఉదయ్ కిరణ్ లాంటి కొత్త హీరోతో చేద్దాం అని చెప్పా అన్నారు. ఎందుకంటే మహేష్ అప్పటికే పెద్ద హీరో.. అలాంటి హీరోతో అంతకంటే పెద్ద కథ చెయ్యాలి అని నేను అనుకున్నా అని ఆదిత్య తెలిపారు. అప్పటికే మహేష్ బాబు వంశీ వంటి యాక్షన్ బేస్డ్ లవ్ స్టోరీ చేస్తున్నారని, ఒక పెద్ద స్టార్‌తో అలాంటి కథ కాకుండా మరింత భారీ స్థాయి చిత్రాన్ని చేయాలని తాను భావించినట్లు పేర్కొన్నారు ఆదిత్య.

ఇది కూడా చదవండి :

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

మహేష్ బాబుకు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు చిత్రం లభించిందని, అది భారీ విజయాన్ని సొంతం చేసుకుందని ఆదిత్య వివరించారు. దాంతో ఎం.ఎస్. రాజు వంటి నిర్మాతలకు కూడా మంచి జరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే వి.ఎన్. ఆదిత్య ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కించిన మనసంతా నువ్వే సినిమా గురించి ప్రస్తావించారు. ఈ చిత్రాన్ని కేవలం 66 రోజుల్లోనే పూర్తి చేశామని, అయితే ఈ షెడ్యూల్ 15 రోజుల చొప్పున నాలుగు నెలలు సాగిందని చెప్పారు. ఉదయ్ కిరణ్ అప్పటికే నువ్వు నేను సినిమాతో బిజీగా ఉండటం వల్ల, రెండు సినిమాల చిత్రీకరణ సమాంతరంగా కొనసాగిందని తెలిపారు. మనసంతా నువ్వే విజయం వెనుక బీఏ రాజు వంటి కీలక వ్యక్తుల కృషిని వి.ఎన్. ఆదిత్య గుర్తుచేసుకున్నారు.

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

తన కెరీర్‌లో బీఏ రాజు, దివంగత ఉదయ్ కిరణ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రమోహన్, శ్రవణ్ (అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా మారి, కోవిడ్‌తో మరణించారు) వంటి వారిని తాను బాగా మిస్ అవుతున్నట్లు వి.ఎన్. ఆదిత్య భావోద్వేగంగా పంచుకున్నారు. తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, సుధా వంటి నటులు తన మాటను గౌరవించి మనసంతా నువ్వేలో నటించారని చెప్పారు. జయంత్ సి. పరాన్జీ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పటి నుంచే వారందరూ తనకు సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. “ప్రేమించుకుందాం రా”, “బావగారు బాగున్నారా”, “ప్రేమంటే ఇదేరా” వంటి సూపర్ హిట్ చిత్రాల విజయాల్లో తాను పాలుపంచుకున్నానని గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి :

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *