Headlines

14 ఏళ్ల తర్వాతా సంచలనమే! 600 కోట్ల వ్యూస్‌తో ‘గంగ్నమ్ స్టైల్’, PSYకి ఎన్ని వందల కోట్లు వస్తున్నాయంటే.? | Gangnam Style Gets Record 6 Billion Views On YouTube


2012లో విడుదలైన ‘గంగ్నమ్ స్టైల్’ పాప్ సాంగ్ ప్రపంచాన్ని ఊపేసింది. గుర్రపు స్వారీ స్టెప్పులతో, క్యాచీ ట్యూన్‌తో  విశేష ఆదరణ పొందింది. లక్షలాది మంది ఈ పాటకు కవర్ వర్షన్లు, డ్యాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. 14 ఏళ్ల తర్వాత కూడా గంగ్నమ్ స్టైల్ అత్యంత ప్రజాదరణ పొందిన మ్యూజిక్ వీడియోలలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ పాట 600 కోట్ల వ్యూస్‌ సాధించింది.  దాంతో దక్షిణ కొరియా సింగర్ ‘సై’ యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో నెలకొంది.

ఈ విషయమై ఓ ఫ్యాన్‌ ‘గ్రోక్’ ఏఐ చాట్‌బాట్‌ను ప్రశ్నించగా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. 2013 గూగుల్ గణాంకాల ఆధారంగా ప్రస్తుత వ్యూస్ ను లెక్కగట్టి “గ్రోక్‌” ఒక అంచనాకొచ్చింది. ఈ పాట 2013లో 1.2 బిలియన్ వ్యూస్ సాధించిన సమయానికే, యాడ్స్ ద్వారా 8 మిలియన్ల డాలర్లు అంటే రూ. 66 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వ్యూస్ 6 బిలియన్లు దాటింది. అంటే దాదాపు రూ. 250 నుంచి 300 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.  అయితే గంగ్నమ్‌ స్టైల్‌’ ఆదాయం యూట్యూబ్‌ యాడ్స్‌కే పరిమితం కాలేదు. గ్లోబల్ డిజిటల్ మార్కెట్‌లో ఈ పాట వివిధ రూపాల్లో కాసుల వర్షం కురిపిస్తోంది.  మల్టీ-ఛానల్ ఆదాయ వనరులు: డిజిటల్ డౌన్‌లోడ్‌లు, ఆడియో స్ట్రీమింగ్,  ఆన్-డిమాండ్ సేవల ద్వారా ఈ పాట బిలియన్ డాలర్ల విలువైన బిజినెస్‌ను సృష్టించింది. ఇక ‘కంటెంట్ ఐడీ’ ద్వారా పేరడీలు, కవర్ సాంగ్స్ ఆదాయం , అన్నీ కలిపితే సై బృందానికి రూ. 800 కోట్లు వస్తుండొచ్చనేది ఓ అంచనా.

ఎవరికి ఎంత వాటా వెళుతుంది?

డిజిటల్ ఆదాయం నేరుగా సింగర్ ‘సై’ (PSY) ఖాతాకే వెళ్లదు. అందులో యూట్యూబ్ వాటా పోను, మిగిలిన మొత్తాన్ని రికార్డ్ లేబుల్, మ్యూజిక్ ప్రొడ్యూసర్లు, కాపీరైట్ ఓనర్లు పంచుకుంటారు. రీల్స్ కల్చర్ అంతగా లేని కాలంలోనే యూట్యూబ్ వేదికగా సరికొత్త సంచలనాలు సృష్టించింది పాట నేటికీ చెక్కుచెదరని క్రేజ్‌తో 6 బిలియన్ వ్యూస్‌ దాటేసింది. ప్రస్తుతం ‘సై’ (PSY) తన సొంత లేబుల్ ద్వారా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ మ్యూజిక్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మ్యూజిక్‌కు భాషతో సంబంధం లేదని, కంటెంట్‌లో దమ్ముంటే ఎంతటి అద్భుతా న్నైనా సృష్టించవచ్చని ‘గంగ్నమ్‌ స్టైల్‌’ నిరూపించింది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *