సినిమా టికెట్ ధరల పెంపు విషయంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పెంపుపై వచ్చిన అదనపు ఆదాయంలో దాదాపు 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని తెలుగు సినీ రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం వినియోగించనున్నట్లు తెలిపింది. అలాగే కొత్తగా స్పెషల్ థియేటర్స్ కేటగిరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. 7.1 సౌండ్, 2K/4K లేదా 75 అడుగులకంటే పెద్ద స్క్రీన్లు ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను స్పెషల్ థియేటర్లు గా గుర్తింపు ఇవ్వనుంది. థియేటర్లలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించవచ్చని.. పెద్ద సినిమాలతో పాటే చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయినప్పుడు.. వాటికి ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో కచ్చితంగా ఒక షో ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..
100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టి తీసే సినిమాలకు ‘సూపర్ హై బడ్జెట్ సినిమాలు’గా గుర్తింపు.. రిలీజైన మొదటి 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. ఇలా టికెట్ రేట్లు పెంచుకోవాలనుకునే నిర్మాతలు.. సినిమా కార్మికుల సంక్షేమ నిధికి కోటి రూపాయల వరకు విరాళం ఇవ్వాలని కండీషన్ పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలు అఖండ 2, ది రాజాసాబ్, మన శంకర వర ప్రసాద్ గారు, పెద్ది చిత్రాలకు కూడా వర్తిస్తాయని తెలిపింది. ఈ నాలుగు చిత్రాల నిర్మాతలకు ఎగ్జిబిటర్ల నుంచి 20 శాతం సంక్షేమ విరాళాన్ని వసూలు చేసి ప్రభుత్వం సూచించిన ఖాతాలో జమ చేసే అధికారాన్ని కల్పించారు.
ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..
ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్స్ ఇండియా, వృద్ధి సినిమాస్ సంస్థలకు ప్రభుత్వం లేఖలు పంపింది. సంబంధిత నిర్మాతలు ఎగ్జిబిటర్ల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసి టీజీఎఫ్డీసీ ద్వారా నిర్వహించే తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖాతాలో జమ చేయాలని హోం శాఖ ఆదేశించింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..