Headlines

Anand Deverakonda: ఇంట్లో రష్మికను వదిన అని పిలవను.. ఆసక్తికర విషయం చెప్పిన ఆనంద్ దేవరకొండ | Anand Deverakonda Interesting Comments About His Bonding With Rashmika Mandanna


ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ది మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల జోడీ ఒకటి. నిజం చెప్పాలంటే వీళ్లిద్దరి పెళ్లి ఒక సెన్సేషన్ అని చెప్పవచ్చు. సోషల్ మీడియా లో ఇప్పటికీ వీళ్ల పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. చాలా ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లిపీటలెక్కారు. రాజస్థాన్ వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా పెళ్లి తంతు తర్వాత మళ్లీ తమ పర్సనల్ లైఫ్ లో బిజీ అయిపోయారు విజయ్-రష్మిక. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ రష్మిక మందన్నా గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. బేబీ సినిమాతో బ్లాక్ బాస్టర్ విషయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా రాబోతున్న మరో కొత్త చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. సెప్టెంబర్ 11న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్ పనుల్లో బిజీ బిజీగా ఉంటోంది. హీరో, హీరోయిన్లు కూడా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆనంద్ దేవరకొండ రష్మికతో తన బాండింగ్ ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు. ‘రష్మిక వరుసకు నాకు వదిన అవుతుంది. కానీ నేను ఆమెని వదిన అని పిలవను. ఎందుకంటే ఆమె నాకన్నా చాలా చిన్నది. అందుకే రషీ అని పిలుస్తుంటాను. తప్పుగా అనుకోవద్దు. రషీ చాలా పాజిటివ్, కైండ్ సోల్ అమ్మాయి. చాలా జోవియల్ గా ఉంటుంది. ఆమె ఎప్పుడు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు ఆనంద్ దేవరకొండ. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా రషీ అనే పేరు చాలా అందంగా, ముద్దుగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఎపిక్ సినిమా విషయానికి వస్తే.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్య దేవర నాగంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీని నిర్మించారు. శివాజీ, వాసుకీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఖుషి, హాయ్ నాన్న, 8 వసంతాలు, ది గర్ల్ ఫ్రెండ్ వంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ మూవీకి కూడా స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఎపిక్ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, గ్లింప్స్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి సెప్టెంబర్ 11న భారీ అంచనాలతో రిలీజ్ కానున్న ఎపిక్ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *