ఇన్‌బిల్ట్ స్క్రీన్ రికార్డర్: మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ఈ ఆప్షన్ ద్వారా వాట్సాప్ కాల్‌ను రికార్డ్ చేయెచ్చు. ఇందుకోసం మీరు కాల్ మాట్లాడే ముందు ఫోన్ నోటిఫికేషన్ ప్యానెల్ నుంచి ‘ స్ర్రీన్ రికార్డర్ ’ ఆప్షన్ ఆన్ చేయాలి. అలాగే ఆడియో సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ Mic లేదా System Sound సెట్ చేసుకుంటే చాటు ఆటోమెటిక్‌గా మీ కాల్ రికార్డ్ అవుతుంది. కాల్ అయిపోగానే రికార్డింగ్ ఆపిస్తే.. ఆడియో మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది.
స్పీకర్ ఆన్ చేయడం: అయితే కొన్ని ఫోన్లలో ఇన్‌బిల్ట్ స్క్రీన్ రికార్డర్ ఆప్షన్ ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే మీ వాట్సాస్ కాల్‌ను లౌడ్ స్పీకర్లో పెట్టి, మైక్రోఫోన్ ద్వారా రికార్డ్ చేయాలి. లేదా ప్లే స్టోర్‌లో దొరికే కాల్ రికార్డర్ యాప్స్ ద్వారా కూడా రికార్డ్ చేయొచ్చు. కానీ ఆ యాప్స్ వాడే ముందు పర్మిషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర అనుమతులు ఇస్తే డేటా చోరీ అవ్వచ్చు.
మ్యాక్‌బుక్ కనెక్షన్: ఒక వేళ మీరు ఐఫోన్ యూజర్ అయితే.. ఆపిల్ సెక్యూరిటీ రూల్స్ ప్రకారం నేరుగా రికార్డ్ చేయడానికి రాదు. కాబట్టి మీ ఐఫోన్‌ను కేబుల్ ద్వారా మ్యాక్‌బుక్‌కు కనెక్ట్ చేసి రికార్డు చేయొచ్చు. ఇందుకోసం QuickTime Playerలో 'New Audio Recording పై క్లిక్ చేసి కాల్‌ను స్పీకర్లో పెట్టి మ్యాక్ ద్వారా రికార్డ్ చేయవచ్చు.
అలా కాకుండా మరో ఆప్షన్ ఏదైనా ఉందంటే.. మరొక ఫోన్ లేదా వాయిస్ రికార్డర్ ద్వారా మీ వాట్సాప్ కాల్‌ను రికార్డ్ చేయవచ్చు. ఇందుకోసం మీరు వాట్సాప్ కాల్‌ను స్పీకర్లో పెట్టి, పక్కనే వేరే ఫోన్లోని వాయిస్ రికార్డర్ ద్వారా మీ కాల్‌ను రికార్డ్ చేయవచ్చు. ఇది చాలా సింపుల్ పద్దతి.. దీని వల్ల ఎలాంటి సమస్య ఉండదు.
అయితే ఇలా మీరు కాల్ రికార్డ్ చేసే ముందు కొన్ని రూల్స్ అయితే పాటించాలి. అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా మీరు కాల్ రికార్డ్ చేయవద్దు. ఎందుకంటే ఇది చట్టవిరుద్దం అవుతుంది. అలాగే రికార్డ్ చేసిన ఆడియోలో వ్యక్తిగత లేదా సున్నితమైన సమాచారం ఉంటే దానికి చాలా సెక్యూర్‌గా ఉంచుకోండి.. ఆ ఆడియోను ఉంచే ఫైల్‌కు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను పెట్టుకోండి. మీ పని పూర్తయిన తర్వాత డిలీట్ చేయండి.




