Headlines

Onion Prices: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఉల్లిపాయల ధరలు.. ఒకేసారి డబుల్.. ప్రస్తుతం కిలో ఎంతంటే..? | Onion Price Hike: Why Are Onion Rates Rising Across India, check latest rates in hyderabad and vijayawada


సామాన్యులకు బ్యాడ్‌న్యూస్. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. కూరగాయలతో పాటు సరుకుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులపై మరింత భారం పడుతోంది. రోజువారీ కూలీ చేసుకుని జీవితం కొనసాగించేవారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల టమాట ధరలు పెరగ్గా.. ఇప్పుడు ఉల్లిపాయల ధరలు గత కొద్దిరోజులుగా మండిపోతున్నాయి. ఒకవైపు చక్కెర ధరలు పెరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఉల్లి కూడా తోడైంది. గత కొద్ది రోజుల్లో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వంటిట్లో అవసరమైన అత్యంత నిత్యావసర వస్తువుల్లో ఉల్లిపాయలు ఒకటి. రోజూ వంటల్లో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది లేనిది ఏ కూర కూడా వండటానికి కుదరదు. కొద్ది రోజుల క్రితం కిలో రూ.20కే లభించగా.. ఇప్పుడు రెట్టింపయ్యాయి.

హైదరాబాద్‌లో ఉల్లి ధర ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. హైదరాబాద్‌లోని హెహిదీపట్నం రైతు బజార్‌లో చూస్తే సెప్టెంబర్ 2వ తేదీన కిలో ఉల్లిపాయలు రూ.40గా ఉండగా.. టమాట రూ.19, వంకాయ రూ.35, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.37, కాకరకాయ రూ.26, బీరకాయ రూ.35, క్యాబేజీ రూ.15, బీన్స్ రూ.65, క్యారెట్ రూ.37, దొండకాయ రూ.23, చిక్కుడు కాయ రూ.35, బీట్ రూట్ రూ.32, ఆలుగడ్డ రూ.16, కీర రూ.18, దోస రూ.15, సొరకాయ రూ.9, పొట్లకాయ రూ.13, చామ రూ.25 వద్ద కొనసాగుతున్నాయి.

విజయవాడలో కిలో ఉల్లి రూ.50

ఇక విజయవాడలోని రైతు బజార్లలో చూస్తే కిలో ఉల్లి రూ.48 పలుకుతోంది. టమాట రూ.30, వంగ రూ.24, బెండ రూ.16, పచ్చిమిర్చి రూ.32, కాకర రూ.28, క్యాబేజీ రూ.24, క్యారెట్ రూ.45, దొండకాయ రూ.28, బంగాళదుంప రూ.28, గోరుచిక్కుడు రూ.24, దోస రూ.16, చిక్కుళ్లు రూ.40, బీరకాయ రూ.24, చామదుంప రూ.34, కంద రూ.34, బీట్ రూట్ రూ.40, కీరదోస రూ.50, బీన్స్ రూ.94, క్యాప్చికం రూ.50, అలసందలు రూ.30, చిలకడదుంప రూ.46కు లభిస్తున్నాయి.

భారత్‌లో సగటు ధర ఎంతంటే..?

భారత్‌లో సగటు కిలో ఉల్లి ధర రూ.49.59కి చేరుకుంది. 2025 సెప్టెంబర్ 2వ తేదీన కిలో ఉల్లి రూ.28.48గా ఉండగా.. ఇప్పుడు 74 శాతానికిపైగా పెరిగింది. అయితే ఉత్పత్తి వల్ల ఈ కొరత రాలేదని, రబీ కోత సమయంలో కురిసిన అకాల వర్షాలు పంటను దెబ్బతీశాయని చెబుతున్నారు. నిల్వ నష్టాల వల్ల మండీలకు చేరే నాణ్యమైన ఉల్లిపాయల పరిమాణం మరింత తగ్గిందని, దాని వల్లనే ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. భారత్‌లో ఈ ఏడాది సుమారు సుమారు 307.37 లక్షల టన్నుల ఉల్లిపాయలు అయ్యాయి. అయితే ప్రస్తుత ధరల పెరుగుదలకు ఉత్పత్తి తగ్గడం కంటే. వాతావరణం వల్ల కలిగే నష్టంప్రధాన కారణంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *