ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రానున్నాయి. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, గాంధారి వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటి కంటే ముందే ఓ తెలుగు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే డిజిటల్ స్ట్రీమింగ్ లో ప్రత్యేక్షమైంది. కింగ్ అక్కినేని నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ఈ ఎమోషనల్ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. అయితే మూడు వారాల గ్యాప్ లోనే ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ సినిమా పేరు ‘పళ్ల బురుసు’. బలగం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఇందులో తండ్రీ కొడుకులుగా ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే గోమతి, ప్రజ్వల్ యాద్మ, సుజాత, అంజి, రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా… ఆదిత్య శెట్టి, వివేక్ కృష్ణ నిర్మాతలుగా వ్యవహరించారు.
తెలంగాణ పల్లె నేపథ్యంతో తెరకెక్కిన పళ్ల బురుసు సినిమాలో ఒక క్యూట్ లవ్ స్టోరీని కూడా చూపించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. అయితే ఇప్పుడు మూడు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మధ్యన థియేటర్లలో ఆడని సినిమాలు కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. మరి పళ్ల బురుసు సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
అమెజాన్ ప్రైమ్ వీడియోలో పళ్ల బురుసు సినిమా స్ట్రీమింగ్..
#TMSRUpdates #TMSRUOTTUpdates 📱#Pallaburusu Now Streaming On @PrimeVideoIN In Telugu, Tamil, Kannada, and Malayalam#PallaburusuOnPrime@dir_udaychauhan #SudhakarReddy #MuralidharGoud @PrajwalYadma @itsGomathy @pawanch19 @Lumbini3011 @srujana_AJ @lemonsprasad @adityapittie pic.twitter.com/B9te3tIQGM
— TMSRUpdates ❁ (@TMSRUpdates) September 2, 2026
పళ్ల బురుసు సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.