Headlines

“జలం… జీవం – జీవితం! ఆకట్టుకుంటున్న సీఎం చంద్రబాబు పోస్ట్ | Krishna River Water Reaches Drought Hit Prakasam Through Veligonda Project: CM Chandrababu Shares Heartwarming Monkey Photos video tv9d – Political Videos in Telugu


వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో కృష్ణా జలాలు పారిన వేళ చోటుచేసుకున్న ఆసక్తికర దృశ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మంగళవారం ప్రారంభమైన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా నల్లమల కొండలను చీల్చుకుంటూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ ఫీడర్ కెనాల్ వద్ద కాలువ నీటిని కోతులు తాగుతున్న మనోహరమైన ఫొటోలను సీఎం షేర్ చేశారు. “జలం… జీవం – జీవితం!” అంటూ ఆయన పెట్టిన క్యాప్షన్ నీటి ప్రాధాన్యతను సార్థకం చేస్తోంది. కరువు నేలకు కృష్ణా జలాలు అడుగుపెట్టిన వేళ, అక్కడి మూగజీవాలు కూడా ఆ నీటిని ఆస్వాదిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ప్రాజెక్టు కేవలం సాగునీటి వనరు మాత్రమే కాకుండా కరువు ప్రాంత ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకురానుంది. తొలిదశ ద్వారా నల్లమల సాగర్‌కు 10.70 టీఎంసీల నీటిని తరలించి, 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందనుంది. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని వేధిస్తున్న తీవ్ర ఫ్లోరైడ్ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం చూపనుంది. నీటి లభ్యత పెరిగితే భూగర్భ జలాలు పెరగడంతో పాటు వ్యవసాయం, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. నిన్న కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన చంద్రబాబు, నేడు ఆ జలాలు జీవజాలానికి అందుతున్న వైనాన్ని ఒక చిన్న ఫోటో ద్వారా కళ్లకు కట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దుమ్మురేపేలా పవన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు

అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్‌లైన్‌లోనే పెద్దల ఆశీస్సులు!

వెయ్యి రోజుల పాలన.. ఫ్రీగా ఉల్లిగడ్డల పంపిణీ! వరంగల్‌లో కాంగ్రెస్ నేత వినూత్న సంబరాలు!

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్‌? భారీగా తగ్గిన పసిడి ధర

బైక్‌పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *