Headlines

ఆ చేపలను తినకండి.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక! | Bihar Floods: Government Warns People Not to Eat Unidentified Fish Found in Floodwaters video


నేపాల్‌ నుంచి వస్తున్న వరద నీటితో అతలాకుతలమవుతున్న బీహార్‌కు మరో కొత్త భయం పట్టుకుంది. వరద ఉధృతికి జలాశయాల నుంచి కొట్టుకొస్తున్న అసాధారణంగా ఉన్న, గుర్తుతెలియని చేపలను తినవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ వనరుల శాఖ కీలక ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది. వరదల్లో మురుగునీరు, రసాయనాలు, చనిపోయిన జంతువుల వ్యర్థాలు కలవడంతో ఆ నీటిలో ప్రయాణించే చేపలు పూర్తిగా కలుషితమయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గండక్ నది పరివాహక ప్రాంతాల్లో భారీ చేపలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అసాధారణ క్యాట్‌ఫిష్‌లను చూసి ఎవరూ మోసపోవద్దని స్పష్టం చేశారు. కుళ్లిన లేదా వరదల్లో దొరికిన చేపలను అమ్మడం, కొనడం, తినడం వంటివి పూర్తిగా నిషేధించారు. సరైన గుర్తింపు, భద్రతా నిర్ధారణ లేని ఇలాంటి చేపలను తింటే బ్యాక్టీరియా, వైరస్‌ల కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. పొరపాటున వాటిని తిని వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, తలతిరగడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురైతే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లి వైద్య సహాయం పొందాలని సూచించారు. అసాధారణ చేపలు ఎక్కడైనా కనిపిస్తే స్థానిక మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. ఇది మీకోసమే

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం..

అదుపు తప్పి బావి వైపు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 54 మంది ప్రయాణికులు…!

ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!

ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *