Headlines

Avika Gor: అవికా గోర్ ఆ సీన్ చేయనంటే చేయనంది.. దాంతో కథనే మార్చేశాం


Avika Gor: అవికా గోర్ ఆ సీన్ చేయనంటే  చేయనంది.. దాంతో కథనే మార్చేశాం

ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అనేక అనుభవాలను, ముఖ్యంగా కొన్ని సినిమాల నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మేము వయసుకు వచ్చాం చిత్ర ప్రివ్యూ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించినప్పుడు నాని, శర్వానంద్ వంటి అగ్ర హీరోలు సినిమాను చూసి ఎంతగానో ఆకట్టుకున్నారని తెలిపారు. “ఇలాంటి సినిమా మాకు వస్తుందా?” అని వారు అడిగారని, అది సినిమా విజయాన్ని ముందే సూచించిందని బెక్కం వేణుగోపాల్ గుర్తు చేసుకున్నారు. తనీష్ స్నేహితులుగా వీరంతా మేము వయసుకు వచ్చాం చిత్రానికి అపూర్వ మద్దతు అందించారని, నాని స్వయంగా వాయిస్ ఓవర్ ఇచ్చారని పేర్కొన్నారు. నేను లోకల్, సినిమా చూపిస్తా మామ వంటి చిత్రాల కోసం నటీనటుల ఎంపిక గురించి కూడా ఆయన వివరించారు. నేను లోకల్ కోసం మొదట సందీప్ కిషన్‌ను అనుకున్నారని, ఆ తర్వాత దిల్ రాజుతో చర్చించి నానికి కథ చెప్పగా, ఆయన 20 నిమిషాల కథ వినగానే నచ్చిందని, దానిని డెవలప్ చేశామని తెలిపారు. సాయి ధరమ్ తేజ్‌తో సినిమా తీయడానికి అనేక ప్రయత్నాలు చేసినా అవి కార్యరూపం దాల్చలేదని చెప్పారు.

మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..

సినిమా చూపిస్తా మామ చిత్రం నిర్మాణ సమయంలో ఎదురైన ఒక ముఖ్యమైన సవాలును కూడా బెక్కం వేణుగోపాల్ పంచుకున్నారు. ఈ సినిమాలో అవికా గోర్ నటించిన కథలో ఇంటర్వెల్ వద్ద హీరోయిన్ గర్భవతి అవుతుందని, దానిపై కథ నడుస్తుందని వివరించారు. అయితే, అవికా గోర్ ఈ పోర్షన్‌ను చేయడానికి నిరాకరించారని, మార్పులు చేస్తేనే చేస్తానని చెప్పారని తెలిపారు. ఈ దశలో బెల్లంకొండ సురేష్ వంటి వారు కూడా రెండు వేర్వేరు ప్రాజెక్ట్‌లను (ఉయ్యాల, జంపాల) ఒకే కథగా మార్చమని సూచించారని, పంపిణీదారులు కూడా కథ మార్చడం సరైనదని అభిప్రాయపడ్డారని అన్నారు. వారి సూచనల మేరకు కథలో మార్పులు చేసి, అవికా గోర్‌కు కొత్త వెర్షన్ నచ్చడంతో సినిమా పూర్తైందని వివరించారు.

8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.. రూ.25 కోట్లు పెడితే రూ.180 కోట్లు వచ్చాయి.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..

డిస్టిబ్యూటర్స్ తాను ఎంత ప్రాధాన్యత ఇస్తారో బెక్కం వేణుగోపాల్ స్పష్టం చేశారు. “ఇప్పుడు అయినా ఎప్పుడైనా డిస్ట్రిబ్యూటర్లే కదండీ ఫస్ట్ నా బాధను పంచుకునేది? నేను సినిమా తీసిన తర్వాత నాకు డబ్బులు ఇచ్చేది ఎవరు? డిస్ట్రిబ్యూటర్లు” అని ఆయన పేర్కొన్నారు. తమ సినిమాలను పంపిణీదారులకు ఎప్పుడూ చూపించి, వారి అభిప్రాయాలు తెలుసుకుని, నచ్చితేనే అమ్ముతానని, అది తమ సంప్రదాయమని ఆయన నొక్కి చెప్పారు. పంపిణీదారులు తమకు శాశ్వత భాగస్వాములని, వారి అనుభవం, మార్కెట్ జ్ఞానం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.

Jabardasth Komaram: జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *