Headlines

అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు సెట్ బాయ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్


అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు సెట్ బాయ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్

కేరాఫ్ కంచరపాలెం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను రూపొందించిన దర్శకుడు వెంకటేష్ మహా తన సినీ ప్రస్థానానికి ముందు పడిన కష్టాలు, నేర్చుకున్న పాఠాలు అందరికీ ఆదర్శప్రాయం. చిన్నవయసులోనే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని, తనదైన మార్గాన్ని ఏర్పరుచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వెంకటేష్ మహా పదిహేనేళ్ల వయసులో తన తండ్రిని కోల్పోయారు. ఆయన తల్లి, అన్నయ్యలు అండగా ఉన్నప్పటికీ, చిన్నప్పటి నుంచీ తండ్రి నేర్పిన స్వ తంత్రంగా జీవించాలనే విలువలను మహా పాటిస్తున్నారు. అన్నయ్యలు తమ జీవితాలను నిర్మించుకుంటున్న సమయంలో, వారిపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్నారట మహా. పదిహేను, పదహారేళ్ల వయసులో ఇంటి నుండి బయటపడి, తన సొంత మార్గాన్ని అన్వేషించడం ప్రారంభించారు. ఈ దశలో ఆర్థిక భద్రత లేకపోయినా, తన కాళ్ళపై తాను నిలబడాలనే తపన బలంగా ఉండేది.

Jabardasth Komaram: జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా

ఆయన మొదట ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు, ఎన్‌సైక్లోపీడియాలు అమ్మేవారట. ఎవరైనా సరే, ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు చేసే మొదటి పని ఇదే అని ఆయన అన్నారు. అవసరం లేని వారికి కూడా ఒక అవసరాన్ని సృష్టించి వస్తువులు అమ్మడంలో నైపుణ్యం సంపాదించారు. అయితే, ప్రజల కష్టార్జితాన్ని అనవసరమైన వాటికి ఖర్చు చేయిస్తున్నాననే అపరాధ భావనతో ఆ పనిని విడిచిపెట్టారట. ఆ తర్వాత, టాటా వాకీ, రిలయన్స్ సెల్‌ఫోన్‌ల అమ్మాను పనిచేశారు. మహా చిన్నప్పటి నుంచీ నటుడు కావాలని కలలు కనేవారట. విజయవాడ, మిర్యాలగూడల నుంచి హైదరాబాద్ వచ్చి ఆడిషన్లలో పాల్గొనేవారు.

మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..

నటుడిగా అవకాశాలు ఇస్తామని చెప్పి, డబ్బులు వసూలు చేసే మోసపూరిత ఆడిషన్లను కూడా ఎదుర్కొన్నారు. దీంతో సినిమాలోకి రావడం తక్షణమే సాధ్యం కాదని అర్థం చేసుకున్నారు. బతికేందుకు, అపోలో హెల్త్ స్ట్రీట్‌లో కేపీఓ ఉద్యోగంలో చేరారట. అయితే సినిమా ఆశలు వదులుకోలేదు. పూరీ జగన్నాథ్  కృష్ణానగర్‌లో సినిమా వాళ్ళు ఉంటారని చెప్పిన మాటను నమ్మి, లంచ్ బ్రేక్‌లో అక్కడ తిరిగేవారట. ఒక రోజు, ఒక జూనియర్ ఆర్టిస్ట్‌ని కలవడం ద్వారా “పొద్దున్న ఐదింటికి రా, మొత్తం సినిమా ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది” అనే సమాచారం తెలుసుకున్నారట. తక్షణమే తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, తెల్లవారుజామున 5 గంటలకు కృష్ణానగర్‌కు చేరుకున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ తీన్‌మార్ సినిమా సెట్‌కి సెట్ బాయ్‌లను ఎక్కించే ట్రక్‌ను చూశారు. రూ.150 కూలికి సెట్ బాయ్‌గా చేరారట. కంప్యూటర్‌లతో పనిచేసిన ఒక రోజు తర్వాత, మేకులు కొట్టి, బరువైన సామాగ్రి మోయడం వంటి పనులు చేయడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ గారి సెట్‌లో తాను పనిచేస్తున్నాననే ఆనందం, సినిమా పరిశ్రమలో భాగమయ్యే అవకాశం ఆయన్ని ఎంతో సంతోషపెట్టాయి. ఆరు నెలల పాటు సెట్ బాయ్‌గా, జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ, కెమెరామెన్ల నుంచి ఇతర టెక్నీషియన్ల వరకు అందరి పనులను దగ్గరగా పరిశీలించారట. ఈ అనుభవమే దర్శకుడిగా ఆయన ఎదుగుదలకు బలమైన పునాది వేసిందని వెంకటేష్ మహా అన్నారు.

8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.. రూ.25 కోట్లు పెడితే రూ.180 కోట్లు వచ్చాయి.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *