Headlines

CM Revanth Reddy: పాలిటెక్నిక్ విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ.. ఏం చెప్పారంటే? | CM Revanth Reddy Clarifies No Changes in Telangana Polytechnic Education System


నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ బహింరగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలిటెక్నిక్ విద్యా విధానంలో మార్పులు చేస్తున్నారనే ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని.. తాము పాద విధానంలో ఎలాంటి మార్పులు చేయట్లేదని సీఎం క్లారిటీ ఇచ్చారు. ఉపాధ్యాయులను అడ్డుపెట్టుకుని కొందరు గవర్నమెంట్‌ను బ్లాక్ మెయిల్ చేసే ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారి ట్రాప్​లో ఎవరూ పడొద్దని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగానే ఉందని.. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అందరం కలిసి నడవాలన్నారు.

ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మళ్లీ కాంగ్రెసేనని దీమా వ్యక్తం చేశారు. వెయ్యి రోజుల్లో ఎన్నో పథకాలు అమలు చేశామని.. కొందరు దుర్మార్గులు మా ప్రభుత్వం విఫలమైందంటున్నారని మండి పడ్డారు. BRS పదేళ్ల పాలన, మా పాలనను బేరీజు వేసుకోండి.. BRS అమలు చేసిన పథకాలు మేం రద్దు చేశామా? ఆ పథకాలను మరింతగా ప్రజల దగ్గరకు తీసుకెళ్తున్నామా? అని ప్రశ్నించారు. BRS పాలనలో చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోయిందని.. ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుని గద్దె నుంచి దిగిపోయారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ అడ్డుపెట్టుకుని రైతుబంధు ఎగ్గొట్టారని.. తాము అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు.

గత పాలకులు వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అన్నారు.. కానీ మేం వరి పండించిన వారికీ బోనస్ ఇచ్చామని చెప్పుకొచ్చారు. 30 నెలల్లో రైతులకు రూ.1.70 లక్షల కోట్లు ఖర్చుచేశామని.. దీనిపై శాసనసభలో చర్చించేందుకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ నేతలు సిద్దమేనా అని సవాల్ విసిరారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణంపై KCR ఆలోచించారా? మా ప్రభుత్వం ఉన్నంతకాలం ఫ్రీ బస్సు పథకం ఉంటుందని సీఎం అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *