Headlines

కామెడీ సినిమా చేయాలంటే నిజంగా అంత కష్టపడుతున్నారా..? | Why Are Telugu Comedy Movies Disappearing? Allari Naresh Explains Why Making Clean Comedy Has Become So Difficult video – Entertainment Videos in Telugu


ఒకప్పట్లా తెలుగులో కామెడీ సినిమాలు ఇప్పుడెందుకు రావట్లేదు..? అల్లరి నరేష్ లాంటి హీరోలు కూడా ఎందుకు కామెడీ వదిలేసి సీరియస్ బాట పడుతున్నారు..? హిలేరియస్ కథలు మన రైటర్లు రాయలేకపోతున్నారా లేదా ఏ కామెడీ చేసినా వివాదానికే దారి తీస్తుందా..? ఇలాంటి సమయంలోనూ ఆ ఒక్క దర్శకుడు మాత్రమే ఎలా ఎంటర్‌టైన్మెంట్‌తో నెట్టుకొస్తున్నారు..? తెలుగులో కామెడీ సినిమాలు ఒకప్పుడు రాజేంద్రప్రసాద్.. ఆ తర్వాత అల్లరి నరేష్ పేర్లే గుర్తుకొస్తాయి. అయితే కొన్నేళ్లుగా ఒకప్పట్లా ఎంటర్‌టైన్మెంట్ సినిమాలు రావట్లేదు. దానిపై నరేష్ చేసిన వ్యాఖ్యలు ఆలోజింపచేసేలా ఉన్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయి కామెడీ సినిమాలు చేయడం చాలా కష్టంగా మారిందని.. ప్రేక్షకులు చాలా సెన్సిటివ్ అయ్యారని, చిన్న విషయాలకే హర్ట్ అవుతున్నారన్నారు నరేష్. బాడీ షేమింగ్ లేదా పేరడీ జోకులను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు నరేష్. దీనికి తోడు ఇండస్ట్రీలో కామెడీ పండించే కథలు రాసే రైటర్స్ కొరత స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. కితకితలు లాంటి కథలను ఇప్పుడు తీస్తే జనాలు అస్సలు ఒప్పుకోరని.. సుడిగాడు 2 తీయాలన్నా సోషల్ మీడియా ట్రోలింగ్ భయం ఉంటోందని ఓపెన్‌గా నిజాలు చెప్పారు నరేష్. ఫ్యూచర్‌లో ఎవరినీ నొప్పించకుండా, ట్రెండ్‌కు తగ్గట్టు మంచి కామెడీ కథ దొరికితే మళ్లీ నవ్విస్తానంటున్నారు నరేష్. దీన్నిబట్టి కామెడీ కష్టమైపోయిందని అర్థమవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ అనిల్ రావిపూడి ఒక్కరే క్లీన్ కామెడీతో కడుపులు చెక్కలు చేస్తున్నారు. ఎంటర్‌టైన్మెంట్‌కే పెద్దపీట వేస్తూ నవ్విస్తున్నారు. ఈ విషయంలో అనిల్ రైటింగ్‌కు ఫిదా అవ్వాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రికార్డు సృష్టించిన స్మృతి మంధాన.. అంతర్జాతీయ క్రికెట్‌లో నెం.1 బ్యాటర్‌గా రికార్డ్‌

El Nino Warning: ఫిబ్రవరి వరకూ ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పొంచి ఉన్న పెను ముప్పు

డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే లైసెన్స్‌ పాయింట్లు కట్‌

గంటలు తరబడి బురదలోనే 91 ఏళ్ల వృద్ధురాలు.. తలను పైకి ఉంచి ప్రాణాలతో బయటపడి

వారెవ్వా.. ఇకపై కరెంట్‌ బిల్లు, గ్యాస్ బిల్లు కూడా వాట్సప్‌లోనే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *