బుల్లితెరపై విశేష ప్రజాదరణ పొందిన కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా ఎంతో మంది కమెడియన్లు తమ ప్రతిభను చాటుకుని ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. తమ పంచ్ డైలాగులు, హాస్యంతో ప్రేక్షకాభిమానాన్ని పొందిన వారిలో కమెడియన్ గణపతి ఒకరు. ముఖ్యంగా ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది టీమ్‌లో నటిస్తూ, కొన్ని స్కిట్లలో మహిళా వేషధారణలతో సైతం నటించి ప్రేక్షకులను విశేషంగా నవ్వించారు. అయితే, కొద్దిరోజుల కిందట టీవీ షోల నుంచి విరామం తీసుకున్న గణపతి, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక సరికొత్త అవతారంలోకి మారారు. నిన్నటివరకు స్టేజీపై నవ్వులు పూయించిన ఈ కమెడియన్, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు.
ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలానికి చెందిన గణపతికి ప్రభుత్వ బడిలో ఉపాధ్యాయుడిగా సేవలు అందించడం అనేది దాదాపు 25 సంవత్సరాల కల. 1998 డీఎస్సీ (DSC) నోటిఫికేషన్‌కు సంబంధించి అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వం ఇటీవల పోస్టింగ్‌లు ఇవ్వడంతో ఆయనకు ఈ టీచర్ ఉద్యోగం లభించింది. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆయన టీచర్‌గా బాధ్యతలు స్వీకరించి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.
ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..
ఒకప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన తాను, ఇప్పుడు విద్యార్థులకు పాఠాలు చెబుతూ, వారిని క్రమశిక్షణతో తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టడం ఎంతో తృప్తిని ఇస్తోందని గణపతి ఆనందం వ్యక్తం చేశారు. పాతికేళ్ల నిరీక్షణ తర్వాత తన ఆశయం నెరవేరినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..
జబర్దస్త్ గణపతి..
Jabardasth Ganapathi News
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..