Headlines

NEET UG 2026 రెండో విడత కౌన్సెలింగ్‌లో MBBS సీట్లు పెరిగాయ్.. MCC కీలక అప్‌డేట్ | MCC Revises NEET UG 2026 Round 2 Seat Matrix, 30 MBBS Seats Added


హైదరాబాద్‌, సెప్టెంబర్ 8: నీట్ యూజీ 2026 రెండో విడత కౌన్సెలింగ్‌లో మెడికల్ సీట్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సీట్ల మ్యాట్రిక్స్‌ను సవరించింది. తాజా సవరణలో మూడు మెడికల్ కాలేజీలకు సంబంధించి కొత్తగా 30 అదనపు MBBS సీట్లు చేర్చారు. ఈ కొత్త సీట్లను అభ్యర్థులు రెండో విడత కౌన్సెలింగ్‌లో Choice Filling సమయంలో తమ ప్రాధాన్యతల జాబితాలో చేర్చుకునే అవకాశం కల్పించారు. దీంతో మెడికల్ సీటు పొందేందుకు అభ్యర్థులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అదనపు MBBS సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం MBBS సీట్ల సంఖ్య 1,36,939కి చేరుకుంది.

రాష్ట్రాల వారీగా MBBS సీట్ల వివరాలు ఇవే

  • కర్ణాటకలో సీట్ల సంఖ్య: 15,395
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో సీట్ల సంఖ్య: 14,000
  • తమిళనాడులో సీట్ల సంఖ్య: 13,999
  • మహారాష్ట్రలో సీట్ల సంఖ్య: 13,099
  • తెలంగాణలో సీట్ల సంఖ్య: 10,250
  • రాజస్థాన్‌లో సీట్ల సంఖ్య: 8,080
  • గుజరాత్‌లో సీట్ల సంఖ్య: 7,750
  • ఆంధ్రప్రదేశ్‌లో సీట్ల సంఖ్య: 7,465
  • పశ్చిమ బెంగాల్‌లో సీట్ల సంఖ్య: 7,200
  • మధ్యప్రదేశ్‌లో సీట్ల సంఖ్య: 6,020

అభ్యర్థులు ఏం చేయాలి?

రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు సవరించిన సీట్ల మ్యాట్రిక్స్‌ను పరిశీలించి, తమకు ఆసక్తి ఉన్న కాలేజీలు, కోర్సులకు అనుగుణంగా Choice Filling చేయాలి. తాజాగా చేర్చిన 30 MBBS సీట్లను కూడా తమ ప్రాధాన్యతల జాబితాలో ఎంచుకునే అవకాశం ఉంది. అదనపు సీట్లు అందుబాటులోకి రావడంతో రెండో విడత కౌన్సెలింగ్‌లో MBBS సీటు కోసం పోటీ పడుతున్న విద్యార్థులకు ఇది కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *