Headlines

Hyderabad: అర్థరాత్రి మరిన్ని రూట్లలో నైట్ షిఫ్ట్ బస్సు సర్వీసులు.. స్టాప్‌ల వివరాలివే.. | Hyderabad Night Bus Services: More Routes Added, Check Route Wise Stops and Timings


గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, అర్ధరాత్రి వేళల్లో ప్రజా రవాణాకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టి.జి.ఎస్.ఆర్టీసీ ప్రారంభించిన రాత్రిపూట బస్సు సర్వీసులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రయాణికుల విజ్ఞప్తులు, రాత్రిపూట అధిక ట్రాఫిక్ రద్దీ, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 2026 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ఆరు ప్రధాన రూట్లలో రాత్రిపూట ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు.

రూట్ నం. 222A కోఠి – పటాన్‌చెరు

అబిడ్స్, లక్డికాపూల్, కేర్ హాస్పిటల్, అన్నపూర్ణ, ఉషాకిరణ్, గుట్లబేగంపేట్, కొండాపూర్ క్రాస్ రోడ్, హఫీజ్‌పేట్, లింగంపల్లి, రామచంద్రాపురం, బీరంగుడి మీదుగా పటాన్‌చెరు వరకు సర్వీసులు..

4 బస్సులు – 16 ట్రిప్పులు – 45 నిమిషాల ఫ్రీక్వెన్సీ

రూట్ నం. 218 – అఫ్జల్‌గంజ్ – పటాన్‌చెరు

CBS, కోఠి, లక్డికాపూల్, ఎస్.ఆర్. నగర్, వై జంక్షన్, KPHB, మియాపూర్, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా సర్వీసులు.

2 బస్సులు – 8 ట్రిప్పులు – 75 నిమిషాల ఫ్రీక్వెన్సీ

రూట్ నం. 219 – సికింద్రాబాద్ – పటాన్‌చెరు.

ప్యారడైజ్, తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, బాలానగర్ క్రాస్ రోడ్, IDPL, ప్రశాంత్ నగర్, కూకట్‌పల్లి, KPHB, హైదర్‌నగర్, గంగారం, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా పటాన్‌చెరు వరకు..

2 బస్సులు – 8 ట్రిప్పులు – 75 నిమిషాల ఫ్రీక్వెన్సీ

రూట్ నం. 290U – హయత్‌నగర్

సికింద్రాబాద్.. భాగ్యలత, పనామా, ఎల్.బి. నగర్, అల్కాపురి, నాగోల్, నాగోల్ మెట్రో స్టేషన్, సర్వే ఆఫ్ ఇండియా, NGRI, తార్నాక, అలుగడ్డబావి, చిలకలగూడ, రాతిఫైల్, సికింద్రాబాద్ ఆల్ఫా, JBS మీదుగా సర్వీసులు.

3 బస్సులు – 14 ట్రిప్పులు – 75 నిమిషాల ఫ్రీక్వెన్సీ

రూట్ నం. 195W – బాచుపల్లి – వేవ్‌రాక్

నిజాంపేట్, నిజాంపేట్ క్రాస్ రోడ్, JNTU, హైటెక్ సిటీ, ESIC, ఇందిరానగర్, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్ మీదుగా వేవ్‌రాక్ వరకు..

3 బస్సులు – 18 ట్రిప్పులు – 40 నిమిషాల ఫ్రీక్వెన్సీ

రూట్ నం. 10H – కొండాపూర్ సికింద్రాబాద్

ప్లాజా, పోలీస్ లైన్స్, ఆర్.జె. కాలేజ్, స్టేట్ హోమ్, ఉషాకిరణ్, సైబర్ టవర్స్ మీదుగా సికింద్రాబాద్ వరకు.

2 బస్సులు – 6 ట్రిప్పులు – 50 నిమిషాల ఫ్రీక్వెన్సీ

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించిన ఈ రాత్రిపూట సర్వీసుల్లో కేవలం ఏడు రోజుల్లోనే 9,286 మంది ప్రయాణికులు ప్రయాణించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అర్ధరాత్రి వేళల్లో కూడా ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ మహానగర ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

ప్రజల నుంచి మరిన్ని కొత్త రూట్లలో రాత్రిపూట బస్సు సర్వీసులు ప్రారంభించాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రయాణికుల డిమాండ్లను, రద్దీని, రూట్ల అవసరాలను అధికారులు సమగ్రంగా పరిశీలించి భవిష్యత్తులో మరిన్ని ప్రధాన మార్గాల్లో థర్డ్ షిఫ్ట్ సర్వీసులను విస్తరిస్తామని వెల్లడించారు.

ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసి, హైదరాబాద్ నగరంలో 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థను దశలవారీగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *