బిగ్ బాస్ కొత్త సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ ఒకేసారి ఈ రియాలిటీ షో గ్రాండ లాంఛ్ జరిగింది. ఇక తెలుగులో అయితే సీజన్ 10 లాంఛ్ గ్రాండ్ గా జరిగింది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. కాగా తెలుగులో లాగే తమిళంలోనూ సీజన్ 10 గ్రాండ్ గా ప్రారంభమైంది. విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా తమిళంలో మొదటి సారిగా 2017లో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. ఇప్పటివరకు మొత్తం 9 సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు భారీ అంచనాలతో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభమైంది. విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్న ఈ షో 2026 సెప్టెంబర్ 6న ప్రారంభమైంది. సాత్విక, మునియమ్మల్, జాసన్, చందిని సహా 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. అలాగే, ‘కుక్ విత్ కోమాలి’ షో ద్వారా ఫేమస్ అయిన అన్సార్ కూడా ఈ రియాలిటీ షోలో అడుగు పెట్టాడు. అయితే ఏమైందో తెలియదు కానీ బిగ్ బాస్ షో ప్రారంభమై రెండు రోజులు గడవక ముందే అతను హౌస్ నుంచి బయటకు పోవడానికి ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గతంలో బిగ్ బాస్ తమిళ సీజన్ 1లో నటుడు భరణి బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, ఇప్పుడు సేమ్ టు సేమ్ అన్సర్ కూడా బిగ్ బాస్ హౌస్ గోడ దూకి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.
‘కుక్ విత్ కోమాలి’ షోకు హోస్ట్‌గా వ్యవహరించి బాగా ఫేమస్ అయ్యాడు అన్సార్. ఇదే కాదు పలు టీవీ షోలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అన్సర్. అదే క్రేజ్ తోనే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. అయితే ఏమైందో తెలియదు కానీ అతను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పోవడానికి. దీనికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే తోటి కంటెస్టెంట్ జాసన్ తో జరిగిన గొడవలు, అలాగే కెప్టెన్సీ విషయంలో జరిగిన డిస్కషన్స్ తో అన్సర్ మనస్థాపానికి గురయ్యాడని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభమై ఇప్పుడు రెండు రోజులు అయ్యింది. ఈ హౌస్ మొదటి వారంలో, సీరియల్ నటి సాత్వికను హజ్మత్స్ కెప్టెన్‌గా ఎన్నుకున్నారు. అయితే, ఇతర సీజన్ల మాదిరిగా కాకుండా, ఈ షోలో డెమోక్రసీ రూమ్ వంటి అనేక కొత్త విషయాలు ఉన్నాయి. అలాగే, ఈ షో మొదటి రోజున కంటెస్టెంట్లను రెండు జట్లుగా విభజించారు. కాగా గతంలో కంటే ఈ సీజన్ చాలా విభిన్నంగా సాగుతోంది.
ఇవి కూడా చదవండి
వీడియో ఇదిగో..
Day 2 dhaana da aachu 🤣😆🤣😆🤣#Biggbosstamil10 #biggbosstamil pic.twitter.com/1UjzTr8neK
— MsTom Prem (@Mstomprem) September 8, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.