Headlines

Bigg Boss 10 Telugu: ఓటింగ్‌లో దూసుకుపోతున్న కామనర్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..! ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..? | Bigg Boss Telugu 10 Voting: While Rohit is leading the voting, Varshini Sounderarajan is in the last position


బిగ్ బాస్ సీజన్ 10 ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. సీజన్ 10ను కింగ్ నాగార్జున ఎంతో గ్రాండ్ గా మొదలు పెట్టారు. హౌస్ లో 16 మంది కంటెస్టెంట్స్ వెళ్లారు. 10 మంది సెలబ్రెటీలు, 6 మంది కామనర్స్ హౌస్ లో ఉన్నారు. సీరియల్ నటి దేబ్జానీ మోదక్, త్రిగుణ్ (ఆదిత్ అరుణ్), సింగర్ ఝాన్సీ, యాంకర్ సుధీర్ రెడ్డి, అమన్ మసూద్, చైత్రా రాయ్, రాం ప్రసాద్, షాలిని, టెంపర్ వంశీ, సృష్టి వ్యాకరణం,జబర్దస్త్ నరేష్, ఆర్జే చరణ్, నటుడు కృష్ణుడు, యాంకర్ వర్షిణి, రోహిత్ నాయుడు, ముఖేష్ గౌడ ఈ 16మంది హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక మొదటి రోజు హౌస్ మేట్స్ సరదాగా గడిపారు అలాగే తొలి రోజే నామినేషన్స్ కూడా షురూ అయ్యాయి. హౌస్ లో ఉన్నవారిని రెండు టీమ్స్ గా డివైడ్ నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టారు బిగ్ బాస్.

ఎన్టీఆర్, పవన్, మహేష్‌లతో ఆడిపాడింది.. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండాపోయింది.

నటుడు త్రిగుణ్, అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రోహిత్ నాయిడు మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం హౌస్‌ను రణరంగంగా మార్చింది. ఇక 16 మందిలో ఇప్పటికే ఎనిమిది మంది ‘మ్యాజికల్ కీస్’ గెలుచుకోగా, మరో ఇద్దరికి మ్యాజికల్ ‘కీ’స్ రావాల్సి ఉంది.  “మీరింకా పూర్తిస్థాయి హౌస్ మేట్స్ కాలేదు, వచ్చే వారం నాటికి చాలా మంది వెళ్లిపోతారు” అని బిగ్ బాస్ హౌస్‌లోని సభ్యులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అలాగే మ్యాజికల్ కీస్ ఉన్న ఎనిమిది మందిని ఇంకో ఇద్దరినీ సెలక్ట్ చేసుకోమని చెప్పాడు బిగ్ బాస్. దాంతో రచ్చ మొదలైంది.

అలాంటి సినిమాలు ఆడవు అన్నారు.. కానీ నా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది: దుల్కర్ సల్మాన్

ఆతర్వాత రచ్చ రచ్చ జరిగింది. రకరకాల విభేదాలు బయట పడ్డాయి. అలాగే ఒకరిపై ఒకరు అభియోగాలు మోపడంతో గందరగోళం నెలకొంది. అలాగే మీరింకా హౌస్ మేట్స్ కావడానికి టాస్కులు గెలవాల్సి ఉంటుంది.. ఎలిమినేషన్ మాత్రం కచ్చితంగా ఉంటుంది అని బిగ్ బాస్ హెచ్చరించాడు. 16 మంది కంటెస్టెంట్లను నామినేషన్‌లోకి తీసుకు వచ్చాడు బిగ్ బాస్. వీరిలో ఈ వారం హౌస్ నుంచి ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. కాగా తొలి వారమే కాబట్టి చాలా మందికి సింగిల్ డిజిట్ ఓట్లే పడుతున్నాయి. అయితే ఓటింగ్ లో రోహిత్ దూసుకుపోతున్నాడు. రోహిత్ 7000వేలకు పైగా ఓట్లు పడుతున్నాయి. అలాగే ముఖేష్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తర్వాత రామ్ ప్రసాద్ , అమన్ , చరణ్ ఉన్నారు. కాగా డేంజర్ జోన్ లో వర్షిణి, చైత్ర, కృష్ణుడు వంశీ ఉన్నారు. ఇంకా ఓటింగ్ కు సమయం ఉండటంతో చూడాలి డేంజర్ జోన్ నుంచి ఎవరు బయట పడతారో చూడాలి

ఇవి కూడా చదవండి



Prabhas Sreenu: ఆ హీరో ఎవ్వరికీ రికమెండ్ చేయడు.. చాలా మొహమాటస్తుడు : ప్రభాస్ శ్రీను

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *