Headlines

అర్రెర్రే.. బిగ్ బాస్ కోసం వచ్చి బుక్ అయ్యిందా.!! నిరుద్యోగులను నిండా ముంచిన రమా నందన | Did Nandu’s World Rama Nandana come to India specifically to participate in Bigg Boss 10 telugu


యూట్యూబ్‌లో కనిపించే తళతళలు, సోషల్ మీడియాలో బిల్డప్ ఇచ్చే లగ్జరీ లైఫ్ స్టైల్స్ వెనుక ఎంతటి చీకటి ప్రపంచం దాగి ఉందో నందన ఉదంతం మనకు కళ్లకు కడుతోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్, సెలబ్రిటీల పక్కన ఫోటోలు ఉన్నాయి కదా అని నమ్మి లక్షల రూపాయలు అప్పగిస్తే.. జీవితాలు ఎలా నడిరోడ్డున పడతాయో చెప్పడానికి ఈ కేసే ఉదాహరణ. అందుకే.. విదేశీ ఉద్యోగాలు, బ్యాక్‌డోర్ వీసాలంటూ వచ్చే ఇలాంటి సోషల్ మీడియా సెలబ్రిటీల ప్రకటనలను నమ్మి మోసపోకండి. అసలు మ్యాటర్ ఏంటంటే.. నందుల నందుస్ వరల్డ్ పేరుతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు రమా నందన. సోషల్ మీడియాలో ఈవిడ బాగానే సందడి చేసింది. విదేశాల్లో ఉంటూ రకరకాల వీడియోలు చేయడంతో పాపులర్ అయ్యింది. ఈ క్రేజ్‌తోనే ఆమె ఈ ఏడాది జనవరిలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘మన శంకర్ వరప్రసాద్’ లో చిన్న పాత్రలో నటించే ఛాన్స్ అందుకుంది.

ఎన్టీఆర్, పవన్, మహేష్‌లతో ఆడిపాడింది.. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండాపోయింది.

ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అసలు మ్యాటర్ అప్పుడే స్టార్ట్ అయ్యింది. నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారు నందు ఆమె భర్త. ఇద్దరూ కలిసి అమాయక నిరుద్యోగులను నిండా ముంచి కోట్లు సంపాదించారు. పెద్ద కన్సల్టెన్సీ నడుపుతున్నట్లు నమ్మబలి డబ్బులు వసూల్ చేశారు ఈ ఇద్దరు దంపతులు. తమకున్న ఈ సోషల్ మీడియా ఫేమ్‌ను పెట్టుబడిగా మార్చుకున్నారు ఈ దంపతులు.

అలాంటి సినిమాలు ఆడవు అన్నారు.. కానీ నా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది: దుల్కర్ సల్మాన్

లండన్‌లో  లగ్జరీ లైఫ్ ఉంటుందని మంచి ఉద్యోగాలు, భారీగా జీతాలు ఇప్పిస్తామని వీసాలు కూడా ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారు. ఒక్కొక్కరి నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు.. కొందరి వద్ద కోటికి పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఇండియాకు వచ్చిన రమా నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే రామ నందన బిగ్ బాస్ కోసమే ఇండియాకు వచ్చిందంటూ ప్రచారం జరుగుతుంది. ఆమెకు ఉన్న క్రేజ్ తో బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొనే అవకాశం వచ్చిందని అందుకే ఆమె లండన్ నుంచి ఇండియాకు వచ్చిందని.. కానీ బిగ్ బాస్ కోసం వచ్చి అడ్డంగా బుక్ అయ్యిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీని పై ఎలాంటి క్లారిటీ లేదు.

ఇవి కూడా చదవండి



Prabhas Sreenu: ఆ హీరో ఎవ్వరికీ రికమెండ్ చేయడు.. చాలా మొహమాటస్తుడు : ప్రభాస్ శ్రీను

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *