Headlines

Hyderabad: ఏందిరా సామి.. బేకరీనా..? కెమికల్ దుకాణమా? అధికారుల సోదాల్లో షాకింగ్ సీన్! | Hyderabad Food Safety Shocker: Bakery Raided for Expired Items, Unhygienic Practices


హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో ఆహార కల్తీ, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై స్పెషల్ ఆపరేషన్ టీమ్‌ (SOT) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు M-FAST, SOT ఉప్పల్ బృందాలు భరత్‌నగర్ కాలనీలోని SLV బెంగళూరు అయ్యంగార్ బేకరీపై తనిఖీలు చేపట్టాయి.

దాడుల్లో బేకరీలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు, బేకరీ ఉత్పత్తుల తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. అంతేకాకుండా బేకరీ పరిసరాలను అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కెంపేగౌడ దేవరాజ్ నవీన్ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనిఖీల సందర్భంగా పలు గడువు ముగిసిన, లేబుల్ లేని, సింథటిక్ ఫుడ్ కలర్, ఇతర ఆహార తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వాటిలో బ్లూ స్టార్ సింథటిక్ ఫుడ్ కలర్స్ 3 బాక్సులు (500 గ్రాముల చొప్పున), గడువు ముగిసిన Bakersville Colourmist లిక్విడ్ ఫుడ్ కలర్స్ 5 బాటిళ్లు (500 గ్రాముల చొప్పున), Bush Sweet Orange ఫుడ్ ఫ్లేవర్స్ 500 గ్రాముల బాటిల్, లేబుల్ లేని సింథటిక్ ఫుడ్ కలర్ బాటిళ్లు 7 (50 గ్రాముల చొప్పున) ఉన్నాయి.

అలాగే మరో 3 చిన్న బాటిళ్ల గడువు ముగిసిన Bakersville Colourmist లిక్విడ్ ఫుడ్ కలర్స్, Real Fruit Power Guava 1 లీటర్ బాటిల్, సుమారు 1 కిలో Pillsbury Cake Mix, 5 కిలోల Cust N Crumb Powder, 1 కిలో Diamond Cake Improverను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాకుండా Classic ఫుడ్ కలర్ ఫ్లేవర్స్ 2 బాటిళ్లు, 2.5 కిలోల Goodrich Glaze Cake Improver బాక్స్‌ను కూడా తనిఖీల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బేకరీలో ఆహార తయారీకి ఉపయోగించే పదార్థాల నిల్వ, వాటి గడువు, లేబులింగ్, పరిశుభ్రత వాతావరణం చూసి అధికారులు షాక్ అయ్యారు. గడువు ముగిసిన పదార్థాలు, సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. సంబంధిత ఆహార భద్రతా నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ప్రజలకు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని ఈ దాడి మరోసారి స్పష్టం చేస్తోంది. స్వాధీనం చేసుకున్న పదార్థాలను తదుపరి పరీక్షలు, అధికారిక విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *