Headlines

పెళ్లైన నాలుగు నెలలకే దారుణం.. భార్యను చంపి.. మృతదేహాన్ని కారులో వదిలి పరార్! | Horror in Khammam: Wife killed inside car, body abandoned near school as accused flees


ఖమ్మం నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కట్టుకున్న భార్యను హత మార్చాడు కిరాతక భర్త.. ఇద్దరూ భార్య భర్తలు కారులోనే వెళుతూ గొడవ పడటంతో గొంతు నులిమి చంపి, కారులోనే మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఖమ్మం నగరం ఖానాపురం పోలీస్ స్టేషన్ పిఎస్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కట్టుకున్న భార్యనే కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసి కారులోనే మృతదేహాన్ని పడేసి పరారయ్యాడు కిరాతక భర్త.. ఇల్లెందు మండలం రొంపేడు కు చెందిన కారు డ్రైవర్ మేడిపల్లి విద్యాసాగరకు నాలుగు నెల క్రితం రేణుకతో వివాహం జరిగింది. వీరు ప్రస్తుతం ఖమ్మం నగరంలోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఓయ్ ఇంట్లో నివాసం ఉంటున్నారు.. నిన్న సాయంత్రం ఇద్దరూ బయటికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు .

ఖమ్మం నుంచి ఇల్లెందు రోడ్‌లోకి రాగానే కారులోనే ఇద్దరూ గొడవపడ్డారు.. రేణుకకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం విద్యాసాగర్ లో కలిగింది దీంతో ఇరు కుటుంబాల మధ్య కలహాలు గొడవలు జరుగుతున్నాయి. విద్యాసాగర్‌కు గతంలో పెళ్లయింది. మొదటి భార్య విడిపోయి వేరుగా ఉంటుంది. నాలుగు నెలల క్రితమే రేణుకను వివాహం చేసుకుని కాపురం చేస్తున్నాడు. కారులో ప్రయాణిస్తున్న సమయంలోనే ఇరువురి మధ్య ఘర్షణ ప్రారంభమైంది. ఈ క్రమంలో విద్యాసాగర్.. భార్య రేణుకను గొంతు నులిమి చంపేశాడు. మన భార్యను చంపినట్లు విద్యాసాగర్ తన దగ్గర స్నేహితునికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

రేణుక మృతదేహాన్ని కారులోనే ఉంచి ఇల్లెందు రోడ్ లోని ఓ ప్రైవేట్ స్కూలు వద్ద కారును వదిలేసి పరారయ్యాడు. ఇంతలోనే పోలీసులు ఇతన్ని ఆచూకీ కోసం ట్రేస్ చేసి చూడగా కారులోనే రేణుక నిర్జీవంగా పడిపోయి ఉండడంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలు తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *