Headlines

Epic Movie Audience Review : ఎపిక్ సినిమా పై అడియన్స్ టాక్.. ఆనంద్, వైష్ణవి కాంబో పై ఏమంటున్నారంటే.. | Epic Movie Audience Review In Twitter Starrer Anand Deverakonda and Vaishnavi Chiatanya


ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించిన సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ఎపిక్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. నైంటీస్ ఏ మిడిల్ క్లాస్ బయెపిక్ వెబ్ సిరీస్ తెరకెక్కించిన డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ ఈరోజు (సెప్టెంబర్ 11న) థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే గురువారం రాత్రే ఈ మూవీ ప్రీమియర్ షోలు పడ్డాయి. దీంతో ఇదివరకే సినిమా చూసిన అడియన్స్ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సినిమాకు ఉదయం నుంచే పాజిటివ్ టాక్ వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రి, కొడుకుల ఎమోషన్స్, బాండింగ్స్ హైలెట్ అయ్యాయని అంటున్నారు. సగం సినిమా కామెడీతో.. మరో సగం సినిమా ఫాదర్, సన్ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ లైఫ్ చాలా రియాల్టీగా చూపించారని అంటున్నారు.

అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ ను ఇంత సింపుల్ అండ్ రియాల్టీగా చూపించడం నచ్చిందని.. కెరీర్ కోసం పర్సనల్ లైఫ్ ని సక్రిఫైజ్ చేసే సిట్యూవేషన్స్ చాలా రిలేటబుల్ గా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఫీల్ గుడ్ సినిమా అని.. ఫన్ అండ్ ఎమోషన్స్ రెండింటిని చాలా బాగా హ్యాండిల్ చేశారని అంటున్నారు.

ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ హిట్టు కొట్టారని .. వీరిద్దరి కెమిస్ట్రీ సైతం మెప్పించిందని అంటున్నారు. విలేజ్ కుర్రాడు అబ్రాడ్ లో ఫేస్ చేసే పరిస్థితిలు, కామెడీ మూమెంట్స్ బాగా వర్కవుట్ అయ్యాయని.. హీరోహీరోయిన్లు యాక్టింగ్ సూపర్ అని.. ఇక ఫాదర్, సన్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయని అంటున్నారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *