టాక్సిక్ మూవీ రిజెల్ట్ .. అండ్ రీజనల్ మూవీ సక్సెస్ రేట్! ఈ రెండింటి కారణంగా ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలపై ఓ లుక్ అయితే పడుతోంది. జక్కన్న మహేష్ తో భారీ బడ్జెట్‌తో వారణాసి సినిమా చేస్తున్నాడు. 90 శాతం సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో.. సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో కూడా దిమ్మతిరిగే కంటెట్‌ను కుక్ చేస్తున్నారు. ఈమూడు సినిమాలు 2027లో రిలీజ్ కానున్నాయి. దీంతో ఈ మూడు సినిమాలు ఇప్పుడు హార్ట్ టాపిక్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. పాన్ ఇండియా లెవలల్లో ఈ మూడు సినిమాలు అదరగొడతాయా.. కలెక్షన్స్ కుమ్మేస్తాయా.. లేక టాక్సిక్ సినిమాకి మల్లే.. చీవాట్లు తెచ్చుకుంటాయా అన్నదే సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే మొదలైన డిస్కషన్.
టాక్సాక్ మూవీ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా..! అయితే ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన టాక్సిక్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీ ఎంత రికవరీ చేసిందనే ఆసక్తి ఫిల్మ్ లవర్స్‌లో కలిగింది. ఇక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో టాక్సిక్ కు ఇప్పటివరకు 247 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయి. నటీనటుల రెమ్యునరేషన్ 120 కోట్లు అన్నట్టుగా టాక్ ఉంది. దీన్ని కూడా తీసేసి చూస్తూ.. పెట్టిన బడ్జెట్ లో ఇప్పటివరకు సగం కూడా రికవర్ అవ్వలేదని ఫిల్మ్ అనలిస్టులు కోట్ చేస్తున్నారిప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీటీడీ సంచలన నిర్ణయం.. భక్తులకు రూ.10 లక్షల బీమా సౌకర్యం!