Headlines

కెరీర్‌ స్టార్టింగ్‌లోనే రిస్క్‌.. ఆ దర్శకుల ధైర్యమేంటి? | Young Tollywood Directors Leave Comfort Zone, Aim for Pan India Glory video – Entertainment Videos in Telugu

కెరీర్‌ స్టార్టింగ్‌లోనే రిస్క్‌.. ఆ దర్శకుల ధైర్యమేంటి? | Young Tollywood Directors Leave Comfort Zone, Aim for Pan India Glory video – Entertainment Videos in Telugu


ఒకప్పుడు ఒకటి రెండు హిట్లు కొట్టిన దర్శకులు, నెక్ట్స్ ప్రాజెక్ట్‌ విషయంలో చాలా సేఫ్ గేమ్ ఆడేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. పాత లెక్కలన్నీ పక్కనపెట్టి, బడ్జెట్, కాస్టింగ్‌ ఇలా అన్ని విషయాల్లో ప్రీవియస్‌ మూవీని మించి రిస్క్ చేసేందుకు యంగ్ డైరెక్టర్స్ రెడీ అవుతున్నారు. కంఫర్ట్ జోన్‌ను వదిలేసి.. పాన్ ఇండియా స్కేల్‌లో తమ నెక్ట్స్ మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రేంజ్‌ రిస్క్ చేస్తున్నా ఆ దర్శకులెవరు..? ‘ఉప్పెన’ లాంటి ప్యూర్ లవ్ స్టోరీతో డెబ్యూలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సానా.. తన నెక్ట్స్ మూవీని ఏకంగా టాప్ హీరో రామ్ చరణ్‌తో ‘పెద్ది’ సినిమాను రూపొందించారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ కావటంతో నెక్ట్స్ మూవీని గ్లోబల్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. వారణాసి తరువాత సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో బుచ్చిబాబు మూవీ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ‘దసరా’ లాంటి రా అండ్ రస్టిక్ మూవీతో ఫస్ట్ అటెంప్ట్‌లోనే బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల.. ఇప్పుడు నానితోనే మరోసారి జతకట్టారు. వీరి కాంబోలో రాబోతున్న ‘ది ప్యారడైజ్’ మూవీ, దసరాను మించి ఉండబోతోందని గ్లింప్స్‌తోనే క్లారిటీ ఇచ్చారు. బడ్జెట్ పరంగా, యాక్షన్ పరంగా నాని కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ మూవీ. అంతేకాదు ఈ సినిమా తర్వాత మెగాస్టార్‌తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు శ్రీకాంత్‌. ‘రన్ రాజా రన్’, ‘సాహో’, ‘ఓజీ’ లాంటి డిఫరెంట్ అటెంప్ట్స్ తర్వాత, సుజీత్ డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓజీ 2’. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, తెరకెక్కుతున్న ఈ సినిమాతో యూనివర్స్‌కు బిజం వేసే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు ఈ యూనివర్స్‌లో ప్రభాస్‌ను కూడా భాగం చేసేందుకు పావులు కదుపుతున్నారు సుజీత్‌. ‘బలగం’ లాంటి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచిన వేణు యెల్దండి.. తన నెక్ట్స్ మూవీ కోసం కంఫర్ట్ జోన్ దాటి ఆలోచిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్‌లో ‘ఎల్లమ్మ’ మూవీని ఎనౌన్స్‌ చేసిన వేణు, ఆ సినిమాతో దేవీ శ్రీ ప్రసాద్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. పెద్ద బడ్జెట్, భారీ కాస్టింగ్‌తో రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నారు. ‘విరూపాక్ష’ లాంటి మిస్టిక్ హారర్ థ్రిల్లర్‌తో సూపర్ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన కార్తీక్ వర్మ దండు కూడా అదే రూట్‌లో వెళ్తున్నారు. ‘విరూపాక్ష’ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో, ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని ‘వృషకర్మ’ను భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఇలా ఒకటి రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకులంతా అస్సలు భయపడకుండా బాక్సాఫీస్ దగ్గర బిగ్ గేమ్ ఆడేందుకు రెడీ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఘాటెక్కిన వంటిల్లు..భగ్గుమంటున్న నిత్యావసర సరుకుల ధరలు

Viral Video: గడ్డికోస్తున్న గొర్రెలు.. ఎక్కడంటే ?

వైన్స్‌లోకి దూసుకొచ్చిన చిరుత.. క్షణాల్లో అక్కడి వ్యక్తిని..

రిటైర్మెంట్ పొదుపు కోసం ఏది బెస్ట్ ?? మీకు సరిపోయే పొదుపు పథకం ఏది?

Auto Driver Love: నెటిజన్లను కదిలిస్తున్న ఆటోడ్రైవర్ ప్రేమకథా చిత్రం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *