‘హోర్ముజ్ జలసంధి అమెరికా భూభాగంలోదే..’ ట్రంప్ అంకుల్ మాటలకు అంతా షాక్! | Strait of Hormuz Crisis: Trump Calls Strait of Hormuz American Territory Amid Rising Iran Tensions
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా తాను భావిస్తున్నానని ఆయన పేర్కొనడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దక్షిణ కరోలినాలోని మైర్టిల్ బీచ్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రస్తుత ఘర్షణకు ముగింపు పలికేందుకు ఒప్పందం చేసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉందన్నారు. అయితే అమెరికాకు…