తమిళనాడు చెన్నైలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మెరీనా బీచ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్ కంటే, సీఎం స్నేహితురాలు, నటి త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. త్రిషకోసం మినిస్టర్స్ గ్యాలరీలో విజయ్ తల్లిదండ్రుల పక్కనే ప్రత్యేకంగా వీఐపీ చైర్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. వేడుకల్లో ఉత్సాహంగా కనిపించిన త్రిష, వచ్చిన అతిథులకు హాయ్ చెబుతూ సందడి చేశారు. పరేడ్ లో సీఎం విజయ్ గౌరవవందనం స్వీకరించారు. ఈ క్రమంలో త్రిష విజయ్ కు సెల్యూట్ చేశారు.. ప్రభుత్వ వేడుకల్లో త్రిషకు ఇచ్చిన ప్రాధాన్యం, తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌తో పాటు పలువురు ఇతర అతిథులతో కలిసి నటి త్రిష కృష్ణన్ ముందు వరుసలో కూర్చుని.. చుట్టూ ఉన్నవారితో నవ్వుతూ, ముచ్చటిస్తూ కనిపించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా త్రిష నిరాడంబరమైన.. ఇంకా సొగసైన సాంప్రదాయ రూపాన్ని ఎంచుకున్నారు. ఆమె బంగారు రంగు చీర ధరించి, ఆభరణాలను చాలా తక్కువగా పెట్టుకున్నారు.. తద్వారా ఆ క్లాసిక్ దుస్తులే ఆమె రూపంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
VIDEO | Actor Trisha joins Independence Day function in Chennai; sits with Tamil Nadu CM Vijay’s parents.
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/vGqEMZahXU
— Press Trust of India (@PTI_News) August 15, 2026
వాస్తవానికి తమిళనాడులో టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతి వేడుకలోనూ త్రిషకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోంది. త్వరలోనే త్రిష ప్రభుత్వంలో కీలక పదవి చేపడతారని చర్చ నడుస్తున్న తరుణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కూడా త్రిష పాల్గొనడం ఆసక్తికరమైన చర్చనడుస్తోంది.
#Trisha joins the Independence Day celebrations in #Tamil Nadu, attending the grand parade alongside #CMVijays parents.#JustIn #TamilCinema #Wizkid pic.twitter.com/FDQ4OacRUU
— anisha.m 🦇 (@anisha13_m13) August 15, 2026
ఇటీవల మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్.. లేటెస్ట్‌గా అన్నాడీఎంకే నేత RB ఉదయ్‌కుమార్.. ప్రభుత్వ వ్యవహారాలకు త్రిషకు ముడిపెడుతూ సీఎం విజయ్‌ను టార్గెట్ చేశారు. త్రిషను త్వరలోనే డిప్యూటీ సీఎం చేస్తారంటూ కామెంట్స్ చేశారు. త్రిష వ్యవహారంలో ప్రభుత్వాన్ని విపక్షాలు టార్గెట్ చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు విజయ్.
త్వరలో తమిళనాట తిరుచ్చి ఈస్ట్ సహా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రాబోతున్నాయి. తమిళనాడు బైపోల్ సీన్‌లో త్రిష పేరు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించకపోయినా..త్రిషను లోక్‌సభకో, రాజ్యసభకో పంపించి ఢిల్లీలో ప్రభుత్వ తరఫున ప్రతినిధిగా నియమించే అవకాశం కూడా ఉంది.